బాహుబ‌లి హిందీ రీమేక్ లో దేవ‌సేన‌గా దీపిక ప‌దుకొనే..

ఆల్రెడీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన బాహుబ‌లిని మ‌ళ్లీ ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌డం ఏంటి పిచ్చిగానీ ప‌ట్టిందా అనుకుంటున్నారా.. ఒక‌వేళ బాహుబలి సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అందులో హీరోగా ఎవరు నటించాలి.. ఎవరు నటిస్తే బాగుంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఇప్పుడు ఈ అనుమానం మ‌న‌కు కాదు వ‌చ్చింది.. కాఫీ విత్ కరణ్ షోలో క‌ర‌ణ్ జోహార్ కు వ‌చ్చింది. ఒకవేళ బాహుబలి సినిమాను హిందీ హీరోలతో రీమేక్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు.. ఆ పాత్ర‌ల‌కు ఎవరైతే బాగుంటారు అని రాజమౌళిని అడిగాడు క‌ర‌ణ్. దీనికి దర్శకధీరుడు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. తన దృష్టిలో బాహుబలిగా.. ప్రభాస్ భల్లాలదేవుడిగా రానా తప్ప ఇంకే నటుడు సూట్ కాలేదని ఓపెన్ గానే కుండ బ‌ద్ధ‌లు కొట్టేసాడు రాజమౌళి.

koffee with karan Prabhas Rana Rajamouli promo
koffee with karan Prabhas Rana Rajamouli promo

ఇక దేవసేన పాత్ర కోసం మాత్రం దీపికా పదుకొనే అయితే బాగుంటుందని సూచించాడు జక్కన్న. ప్రభాస్ కూడా దీపికకే ఓటేశాడు. ఈ షో చాలా సరదాగా జరిగింది. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ప్ర‌భాస్.. ఇందులో రానా కంటే ఎక్కువ సరదాగా మాట్లాడాడు. చాలా విషయాలు కరణ్ జోహార్ షోలో అభిమానులతో పంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ముఖ్యంగా అనుష్కతో మీరు డేటింగ్ చేస్తున్నారా అని కరణ్ జోహార్ ప్రశ్న అడిగితే సింపుల్ గా నవ్వుతూ లేదు భయ్యా అంటూ చెప్పాడు ప్రభాస్. తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అని.. ఇవన్నీ మధ్యలో వచ్చిన కథలు మాత్రమే అని కొట్టిపారేశాడు ప్రభాస్. మొత్తానికి మూడేళ్లుగా బాహుబలి టీంను కాఫీ విత్ కరణ్ షోలో కూర్చోబెట్టాలని అనుకుంటున్న కరణ్ జోహార్ కు ఇన్నాళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. తాను అడగాలనుకున్న ప్రశ్నలతో పాటు అభిమానుల మదిలో ఉన్న ఎన్నో అనుమానాలకు కూడా ఈ షో సమాధానంగా నిలిచింది. బాలీవుడ్ సర్కిల్ లో కూడా కాఫీ విత్ కరణ్ విత్ బాహుబలి టీం బ్లాక్ బస్టర్ అయిపోయింది.

Full Episode:
https://www.hotstar.com/tv/koffee-with-karan/s-74/prabhas-rana-daggubati-and-ss-rajamouli/1000226206

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *