చిరంజీవి-కొర‌టాల శివ‌.. మ‌రో ఠాగూర్ కు సిద్ధం.

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి జాతకం ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్ర‌సాద్ చెప్పిన‌ట్లు నిన్న రైట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య సైరా త‌ర్వాత చిరంజీవి త‌ర్వాతి సినిమా ఏంటి అంటే బోయ‌పాటితోనే క‌దా అన్నారు. కానీ సీన్ లోకి స‌డ‌న్ గా కొర‌టాల శివ వ‌చ్చాడు. ఈయ‌న ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Chiru to act in koratala siva direction after sye raa

చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌. పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌. ఈ మ‌ధ్యే ఈయ‌న చిరంజీవిని క‌లిసాడు.. ఓ క‌థ కూడా చెప్పాడు.

దానికి మెగాస్టార్ కూడా ఓకే అన్నాడు. ప్ర‌స్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఠాగూర్ త‌ర‌హాలోనే ఇది కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందులో లంచం గురించి చెబితే ఇందులో నిరుద్యోగం గురించి చెప్ప‌బోతున్నాడు చిరంజీవి. కొర‌టాల కూడా ఈ క‌థ‌ను ప‌క్కాగా సిద్ధం చేస్తున్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఫిబ్ర‌వ‌రి లోపు సైరా టాకీ పూర్తి చేయాల‌ని సురేంద‌ర్ రెడ్డిని కోరుతున్నాడు చిరంజీవి.

అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది మార్చ్ నుంచి చిరు-కొర‌టాల సినిమా ప‌ట్టాలెక్కడం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే కొర‌టాల సీన్ లోకి వ‌స్తే మ‌రి బోయ‌పాటి ఏమైపోయిన‌ట్లు..? ప‌్ర‌స్తుతం ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌య్యాక బాల‌య్య‌తో సినిమా క‌మిట్మెంట్ ఉంది. ఈ రెండూ పూర్త‌య్యేలోపు చిరు కూడా కొర‌టాల‌తో త‌న సినిమా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటాడు. అప్ప‌టి వ‌ర‌కు ఈ ద‌ర్శ‌కుడికి ఎదురుచూపులు త‌ప్ప‌వు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *