విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో అవుతున్నాడంట తెలుసా..

అదేంటి.. ఇప్ప‌టికే వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు హీరో కావ‌డం ఏంటి విచిత్రం కాక‌పోతే అనుకుంటున్నారా..? ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న వ‌ర‌స సినిమాలు.. విజ‌యాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ కుర్ర హీరో హీరో అవుతున్నాడు. ఇది విన‌డానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం ఇప్పుడు.

Chiranjeevi Title to vijay devarakonda

ఎందుకంటే ఈయ‌న త‌ర్వాతి సినిమాకు హీరో అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అది ఒక‌ప్పుడు చిరంజీవి సినిమా టైటిల్. పెళ్లిచూపులుతో జైత్ర‌యాత్ర మొదలుపెట్టి అర్జున్ రెడ్డి.. గీత‌గోవిందం.. టాక్సీవాలా సినిమాల‌తో సూప‌ర్ స్టార్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇప్పుడు ఈయ‌న మార్కెట్ 100 కోట్ల‌కు పైనే. ప్ర‌స్తుతం విజ‌య్ డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ చిత్ర షూటింగ్ కాకినాడ ప‌రిసర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు క‌మిట్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే క‌మిటైన క్రాంతిమాధ‌వ్ సినిమా జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ మొద‌లు కానుంది. ఆ త‌ర్వాత గీతాఆర్ట్స్, యువీ క్రియేష‌న్స్ లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో చేసిన టాక్సీవాలా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దీనికితోడు మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌బోయే చిత్రంలో హీరోగా న‌టించ‌బోతున్నాడు విజ‌య్. దీనికి టైటిల్ కూడా హీరో అనుకుంటున్నారు. 1984లో చిరంజీవి-విజ‌య బాపినీడు కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా ఇది. త‌ర్వాత నితిన్ కూడా ఈ టైటిల్ వాడుకున్నాడు. ఇప్పుడు విజ‌య్ వంతు. మ‌రి ఈయ‌న చిరంజీవి టైటిల్ తీసుకుని ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here