బోయ‌పాటితో ఆడుకుంటున్న నెటిజ‌న్లు..

బోయ‌పాటి శీను సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కొత్త ద‌నం అనే మాటే లేకుండా చాలా జాగ్ర‌త్త‌గా త‌న సినిమాలు తెర‌కెక్కిస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు కూడా రామ్ చ‌ర‌ణ్ తో చేసిన విన‌య విధేయ రామను ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు కానీ కొత్త క‌థ‌తో కాదు . ధృవ నుంచి కొత్త దారిలో వెళ్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంకు అది పీక్స్ కు చేరిపోయింది.

Ram charan boyapati

ఈ చిత్రంతో ఆయ‌న న‌ట‌న చూసి అంతా ఫిదా అయిపోయారు. ప‌దేళ్లుగా ఇంత న‌ట‌న ఎక్కడ దాచేసావ్ చ‌ర‌ణ్ అంటూ అంతా పొగిడేసారు. ఆ సినిమా త‌ర్వాత వ‌ర‌స‌గా మ‌ళ్లీ కొత్త క‌థ‌ల వైపు అడుగు పెడ‌తానుకుంటున్న త‌రుణంలో బోయ‌పాటి సినిమాతో మ‌ళ్లీ పాత దారిలోకి వ‌చ్చేసాడు. ఇప్పుడు రిలీజైన విన‌య విధేయ రామ టీజ‌ర్ చూసి ఫ్యాన్స్ విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్న‌రాఉ.
ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. టీజ‌ర్ గురించి మాట్లాడుతూ స‌రైనోడు సినిమా మ‌ళ్లీ తీసిన‌ట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా దేవీ కూడా ఆర్ఆర్ మ‌ళ్లీ అదే పాత‌ది కొట్టాడ‌ని.. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ ట్యూన్స్ ఇస్తే క‌నుక్కోలేమా అంటూ దేవీపై సెటైర్ల వ‌ర్షం కురుస్తుంది.

ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా సినిమా చూసిన త‌ర్వాత చూసుకుందాంలే అంటూ ధీమాగా ఉన్నాడు బోయ‌పాటి శీను. రెండు పాట‌లు.. డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా న‌వంబ‌ర్ 9 నుంచి మొద‌లైంది. రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆ అంచ‌నాల‌ను.. మార్కెట్ ను నిల‌బెట్టేలా ఈ చిత్రం ఉంటుంద‌ని ఆశిస్తున్నాడు. అదే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాడు కూడా. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఎఫ్ 2 సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఆ రెండింటినీ త‌న సినిమాతో ఢీ కొట్టాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *