బోయ‌పాటి శీను సినిమాలో కౌశ‌ల్..

కౌశ‌ల్ కౌశ‌ల్ కౌశ‌ల్.. ఇప్పుడు ఎక్క‌డ చూడూ ఇదే పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ 2లో ఈయ‌న పేరు మంత్రంలా మారిపోయింది. ఈయ‌న పేరుమీద బ‌య‌ట ఏకంగా కౌశ‌ల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. పాలాభిషేకాలు చేస్తున్నారు.. కటౌట్లు క‌డుతున్నారు.. 2కే వాక్ లు కూడా చేస్తున్నారు.

అస‌లు ఏం చూసారో ఏమో కానీ కౌశ‌ల్ పై ఎందుకు ఇంత‌గా అభిమానం పెంచుకున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ఈయ‌న క్రేజ్ సినిమా వాళ్ల‌ను కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. దాంతో బిగ్ బాస్ అయిన త‌ర్వాత కౌశ‌ల్ కోసం కొంద‌రు ద‌ర్శ‌కులు క‌థ‌లు ప‌ట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న ఒప్పుకోవాలే కానీ తాము సినిమాలు చేయ‌డానికి రెడీ అంటున్నారు.

ముఖ్యంగా బోయ‌పాటి శీను అయితే బాల‌య్య‌తో చేయ‌బోయే త‌న త‌ర్వాత సినిమాలో కౌశ‌ల్ ను విల‌న్ పాత్ర కోసం అడుగుతున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఆయ‌న ఇంటికి వెళ్లి కౌశ‌ల్ భార్య‌తో కూడా బోయ‌పాటి అసిస్టెంట్స్ టీం మాట్లాడార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎలాగూ మ‌రో రెండు వారాల్లో బిగ్ బాస్ అయిపోతుంది కాబ‌ట్టి క‌చ్చితంగా వ‌చ్చిన త‌ర్వాత కౌశ‌ల్ రేంజ్ అనే మారిపోతుంది అనే ఊహాగానాలు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్నాయి. మ‌నోడు కాస్త కాన్స‌ట్రేట్ చేస్తే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో టాలెంటెడ్ న‌టుడు దొరికేసిన‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here