నాని అంత ప‌ని చేస్తున్నాడా..?

నువ్వు చేస్తున్న షో బాలేదు.. అక్క‌డ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.. ఆ ఇంట్లోకి వ‌స్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ 2పై రోజుకో విధంగా ర‌చ్చ జ‌రుగుతుంది. అదేం విచిత్ర‌మో కానీ ఫ‌స్ట్ సీజ‌న్ లో ఇంట్లోకి వెళ్లి ప్ర‌మోట్ చేసుకున్న సినిమాల‌న్నీ బాగానే ఆడాయి. కానీ ఈ సారి మాత్రం సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఇప్పుడు కాదు.. సీజ‌న్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్లోకి వెళ్లి త‌మ సినిమా ప్ర‌మోట్ చేసుకున్న ఒక్క‌టి కూడా ఆడ‌లేదు.

జంబ‌ల‌కిడిపంబ‌.. వైఫ్ ఆఫ్ రామ్.. విశ్వ‌రూపం 2తో పాటు మొన్నొచ్చిన ఆది నీవెవ‌రో సైతం ఫ్లాప్ అయింది. దాంతో ఇంట్లో వెళ్లి ప్ర‌మోట్ చేసుకుంటే ఫ్లాప్ త‌ప్ప‌దు అనే సెంటిమెంట్ పాకిపోయింది. కానీ ఇంటి గుమ్మం వ‌ర‌కు అంటే నాని దగ్గ‌రికి వ‌స్తే మాత్రం బ్లాక్ బ‌స్ట‌రే. ఈ మ‌ధ్యే విజ‌య్ దేవ‌రకొండ గీత‌గోవిందం టీం.. దానికి ముందు గూఢ‌చారి టీం కూడా అలా వ‌చ్చారు.

అయితే ఇప్పుడు త‌న షోపై వ‌స్తున్న క‌మెంట్స్ త‌నే సీరియస్ గా తీసుకుంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. అందుకే యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. అదే.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ నే బిగ్ బాస్ 2లో చేసుకుని ఏ సెంటిమెంట్ లేద‌ని నిరూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు నాని.

దేవదాస్ సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే బిగ్ బాస్ లో ప్లే చేసారు. ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్ కు కూడా రావాల‌ని చూస్తున్నాడు నాని. నాగార్జున కూడా ఈ షోకు వ‌స్తున్నాడు. మొత్తానికి ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు తానే చెక్ పెట్టాల‌ని చూస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. మ‌రి ఇది రిస్కా లేదంటే ఇష్కా అనేది తేలాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here