దేవుడా కౌశ‌ల్ హీరో అవుతున్నాడా..?

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌లు అయితే ఇవే. 1999లో రాజ‌కుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కౌశ‌ల్. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు. కానీ క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేదు ఎవ‌రూ. సీరియ‌ల్స్ కూడా చాలానే చేసాడు. కానీ జీవితంలో అంద‌రికీ ఒక్కోసారి ఒక్కో టైమ్ వ‌స్తుంది. అది వ‌చ్చిన‌పుడు ఎద‌గ‌కుండా ఎవ‌రూ అడ్డుకోలేరు. ఇప్పుడు కౌశ‌ల్ కు ఇది వ‌చ్చింది.

KAUSHAL-AS-HERO

బిగ్ బాస్ ఈయ‌న జీవితాన్ని మార్చేసింది. ఒక‌టి రెండు కాదు.. ఫైన‌ల్ లో ఏకంగా 39 కోట్ల ఓట్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాడు కౌశ‌ల్. అనామ‌కుడిగా మొద‌లై.. అసాధ్యుడిగా ఎదిగిన కౌశ‌ల్ ప్ర‌యాణం అద్భుత‌మే. తొలిరోజు నుంచే గేమ్ ను గేమ్ లా ఆడ‌టం అల‌వాటు చేసుకున్నాడు కౌశ‌ల్. ఇదే ఆయ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్షగా నిలిచింది కూడా. అదే ఆయ‌న‌కు ప్రేక్ష‌కుల్లో అభిమానాన్ని పెంచేసింది. ఈయ‌న దూకుడు చూస్తుంటే ఇప్పుడు కెరీర్ కాస్త ప్లాన్ చేసుకుంటే టాప్ లోకి వెళ్ల‌డం ఖాయం.

ఇప్ప‌టికే బోయ‌పాటి-రామ్ చ‌ర‌ణ్ సినిమాలో కౌశ‌ల్ ని విల‌న్ గా తీసుకున్నారు అనే టాక్ గ‌ట్టిగానే న‌డుస్తుంది. దానికితోడు బాల‌య్య సినిమాలో కూడా కౌశ‌ల్ కోసం చూస్తున్నాడు బోయ‌పాటి శీను. దానికితోడు ఈయ‌న హీరోగా కూడా సినిమా చేస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఒక్క సీజ‌న్ తో ఈయ‌న రేంజ్ అలా అలా పెరిగిపోయింద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here