విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను ట్రైల‌ర్..

ఎప్పుడో వ‌చ్చిన సినిమాకు ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఏంటి.. అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? క‌రెక్టే కానీ ఇప్పుడు నిజంగానే భ‌ర‌త్ అనే నేను ట్రైల‌ర్ విడుద‌లైంది. త‌మిళ్ లో ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం ఇప్పుడు హిందీ ఇండ‌స్ట్రీకి వెళ్తుంది. అక్క‌డ భ‌ర‌త్ ది గ్రేట్ లీడ‌ర్ పేరుతో విడుద‌ల అవుతుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. సాధార‌ణంగా తెలుగు సినిమాకు ఒక‌ప్పుడు హిందీలో పెద్ద‌గా మార్కెట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా క్రేజ్ పెరిగిపోయింది. మ‌న హీరోల‌కు అక్క‌డ కూడా వ్యూస్ బాగానే వ‌స్తుండ‌టంతో మ‌న సినిమాల‌ని అక్క‌డ విడుద‌ల చేస్తున్నారు.

mahesh-babu

ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కూడా ఇలాగే విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే హిందీ డ‌బ్బింగ్ పూర్తైపోయింది.. ఆర్జే మూవీస్ ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో విడుద‌ల చేస్తున్నారు. అక్క‌డ వ‌స్తున్న ఇమేజ్ చూసి మ‌న సినిమాల‌కు డ‌బ్బింగ్ రైట్స్ భారీగా అమ్మేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భ‌ర‌త్ అనే నేను సినిమా కూడా ఇలా వెళ్లిందే. మ‌న తెలుగు సినిమాల‌కు క‌నీసం కోటికి పైగానే వ్యూస్ వ‌స్తున్నాయి. అల్లు అర్జున్ లాంటి హీరోలు అయితే కుమ్మేస్తున్నారు యూట్యూబ్ లో. నార్త్ ఇండియాలో కూడా బ‌న్నీ అద‌ర‌గొడుతున్నాడు. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా. మ‌రి మ‌న ద‌గ్గ‌ర థియేట‌ర్స్ లో ర‌చ్చ చేసిన భ‌ర‌త్ అనే నేను.. యూ ట్యూబ్ లో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here