స‌ర‌దా కోసం చేస్తే స‌ర‌దా తీరిపోయింది..

ఎవ‌రికి స‌ర‌దా తీరిపోయింది అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ఉన్నాడుగా మ‌న వ‌రాల కొండ బెల్లంకొండ. ఈయ‌న చేసిన ఓ ప‌ని మ‌నోడికి బాగానే విమ‌ర్శ‌లు తీసుకొస్తుంది. పాపం కావాలనేం చేయ‌లేదు.. ఏదో తెలియ‌కుండా స‌ర‌దా కోసం చేసిన ప‌ని కాస్తా ఇప్పుడు విమ‌ర్శ‌ల వ‌ర‌కు తెచ్చింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు తేజ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Bellamkonda-Srinivas-trolled-in-Social-Media

ఈ చిత్ర షూటింగ్ థాయ్ లాండ్ లో జ‌రుగుతుంది. ఇందులో మ‌రోసారి కాజ‌ల్ తోనే జోడీ క‌ట్టాడు బెల్లంకొండ‌. తేజ ఎఫెక్ట్ ఇది.. గురువు గారి మాట కాద‌న‌లేక కోటిన్న‌ర తీసుకుని ఈ చిత్రంలో న‌టించ‌డానికి ఒప్పుకుంది కాజ‌ల్. ఇక ఈ చిత్ర షూటింగ్ లో భాగంగానే మ‌నోడు ఓ చిలిపి ప‌ని చేసాడు. షూటింగ్ గ్యాప్ లో స‌ర‌దాగా అక్క‌డ ఓ ఏనుగు ఉంటే దాని దంతాల‌పై కూర్చుని ఫోటో దిగాడు బెల్లంకొండ‌. ఊరికే ఉండ‌కుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

అంతే ఒక్క‌సారిగా యానిమ‌ల్ ల‌వ‌ర్స్ కు ఈ ఫోటో చూసి చిర్రెత్తుకొచ్చింది. అలా ఏనుగు దంతాల‌పై ఎలా కూర్చుంటారు.. వాటికి బాధ‌గా ఉండ‌దా.. ఎలాగూ మీ సినిమాల్లో జంతువుల‌ను హింసిస్తారు క‌దా.. బ‌య‌ట కూడా ఎందుకు వాటి జీవితాల‌తో ఆడుకోవ‌డం అంటూ బెల్లంకొండ‌పై విర‌చుకుప‌డుతున్నారు జంతు ప్రేమికులు. పాపం త‌ను ఏం త‌ప్పు చేసానో కూడా తెలియ‌కుండానే బ‌లైపోతున్నాడు బెల్లంకొండ‌. అంతేలే.. ఇక్క‌డ నిజంగానే జంతువులను హింసిస్తున్న వాళ్ల‌ను అనే చేవ లేక ఏదో అలా దొరికేసాడు క‌దా అని బెల్లంకొండ‌తో బంతాటాడేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here