రావ‌ణ్ గా బాల‌య్య‌.. రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా..

ఒక్క‌సారి ఆ పోస్ట‌ర్ చూడండి.. అది చూసిన త‌ర్వాత ఇంకేమైనా మాట‌లు వ‌స్తాయా.. అలా చూస్తుండిపోవ‌డం త‌ప్ప‌. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. కేవ‌లం పోస్ట‌ర్స్ తోనే బిజినెస్ అంతా చేస్తున్నాడు క్రిష్‌. ఇప్పుడు కూడా రావ‌ణుడిగా బాల‌య్య క‌టౌట్ చూసి ఫిదా అయిపోతున్నారంతా.

Balakrishna as Raavana From Ntr Biopic

అస‌లు అప్ప‌ట్లో అన్న‌గారు ఎలాంటి మ్యాజిక్ చేసారో ఇప్పుడు బాల‌య్య కూడా అంతే. క్రిష్ ఈ పోస్ట‌ర్ ను ప్ర‌త్యేకంగా క‌థానాయ‌కుడు కోసం డిజైన్ చేసాడు అందుకే ఇందులో రానా లేడు. ఆయ‌న రెండో భాగంలో వ‌స్తాడు. మ‌హానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించారు క‌దా. అందుకే అందులో రానా కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక్కో పోస్ట‌ర్ ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని పోస్ట‌ర్స్ కంటే కూడా ఇది ఇంకా ఆక‌ట్టుకుంటుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇందులో సినిమాలో న‌టించిన వాళ్లంద‌రూ ఉన్నారు. దాంతో ఎక్కువ మంది క‌నిపిస్తున్నారు.. పోస్ట‌ర్ కూడా నిండుగా ఉంది. పైగా బాల‌య్య ఆహార్యం అదిరిపోయింది. ఈ సినిమాకు కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కుడు.

ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 21న ఆడియో.. ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత నెల‌ రోజుల గ్యాప్ తీసుకుని ఫిబ్ర‌వ‌రి 7న మ‌హానాయ‌కుడు విడుద‌ల కానున్నాయి. మొత్తానికి బాల‌య్య‌ను అలా చూస్తుంటే రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదు ఆ రాజ‌సాన్ని చూడ్డానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here