అయ్యో రామా.. దిల్ రాజు మ‌ళ్లీ ఫ‌స‌క్..!

ఒక్క ఏడాదిలో ఎంత మార్పు. 2017 అంతా ఆరు విజ‌యాల‌తో ర‌చ్చ చేసాడు దిల్ రాజు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క విజ‌యం కోసం చూస్తున్నాడు. ఇది క‌దా అస‌లు ట్విస్ట్ అంటే. వ‌ర‌స విజ‌యాలెక్క‌డ‌.. ఒక్క విజ‌యం కూడా రాక‌పోవ‌డం ఎక్క‌డ‌..? ఒక్క ఏడాదిలోనే ఇంత సీన్ జ‌రిగిపోయింది. 2018లో ఈయ‌న మూడు సినిమాలు నిర్మిస్తే అందులో రెండు ఇప్ప‌టికే ఫ‌స‌క్ అయిపోయాయి. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వ‌చ్చాడు.

DIL RAJU

ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణం అంచ‌నాలు అందుకోలేక చేతులెత్తేసాయి. ఆ రెండు సినిమాలు పోయినా కూడా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే వ‌చ్చి ఈ ఏడాది త‌న అకౌంట్ ఓపెన్ చేస్తుంద‌న్న దిల్ రాజు న‌మ్మ‌కాన్ని ఈ చిత్రం నిల‌బెట్టేలా క‌నిపించ‌డం లేదు.
దానికి కార‌ణం యావ‌రేజ్ కంటెంట్.. అంత‌కంటే యావ‌రేజ్ క‌థ‌.. రొటీన్ స్క్రీన్ ప్లేకు తోడు రొడ్డకొట్టుడు కామెడీ. వ‌ర‌స ఫ్లాపులే. నేనులోక‌ల్.. సినిమా చూపిస్తా మావా త‌ర‌హాలోనే మ‌రోసారి మామా అల్లుళ్ల కాన్సెప్ట్ నే ఇందులోనూ వాడుకున్నాడు త్రినాథ‌రావ్ న‌క్కిన అండ్ ప్ర‌స‌న్న కుమార్ బ్యాచ్.

ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణంతో ఫ్లాపులిచ్చిన రాజు.. ఇప్పుడు మూడో సారి ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో అనే టెన్ష‌న్ లో ఉన్నాడు. శ్రీ‌నివాస క‌ళ్యాణం యావ‌రేజ్ టాక్ తో మొద‌లై డిజాస్ట‌ర్ అయింది. ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే కూడా ఇదే టాక్ తో మొద‌లైంది. అయితే పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు దిల్ రాజు. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం చివ‌రికి ఎక్క‌డికి వ‌చ్చి ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here