ఎన్టీఆర్ నేల‌పైకి తెచ్చిన త్రివిక్ర‌మ్..

అదేంటి.. ఇంత‌కుముందు ఆకాశంలో కానీ ఉన్నాడా ఏంటి.. ఇప్పుడు కొత్త‌గా నేల‌పైకి తీసుకురావ‌డానికి అనుకుంటున్నారా..? ఎప్పుడైనా క‌నీసం ఊహించుకున్నారా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ నేల‌పై కూర్చుని అలా చూస్తూ కూర్చుంటాడ‌ని..! అస‌లే మ‌న హీరోల‌పై బ‌య‌ట చాలా విమ‌ర్శ‌లున్నాయి.

NTR-Simplocity-in-Aravinda-Sametha-Shooting-Location

దేవుళ్ల‌లా ఫీల్ అయిపోతుంటార‌ని.. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు క్యార్ వ్యాన్ లోకి దూరిపోతార‌ని. అస‌లు ఎండ‌కు త‌ట్టుకోలేర‌ని.. మ‌నుషుల‌ను క‌నీసం మ‌నుషుల్లా కూడా చూడ‌ర‌ని.. ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవ‌న్నీ త‌ప్ప‌ని కొంద‌రు హీరోలు నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఇదే చేసాడిప్పుడు.

ఈయ‌న కూడా త‌ను మామూలు మ‌నిషినే అంటున్నాడు. అర‌వింద స‌మేత షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతుంది. నాలుగు పాట‌లే ముందు అనుకున్నా కూడా ఇంకా టైమ్ ఉండటంతో ఇప్పుడు ఐదో పాట కూడా చిత్రీక‌రిస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఇందులో భాగంగానే షూటింగ్ గ్యాప్ లో అలా భూమ్మీద కూర్చున్నాడు ఎన్టీఆర్. పూజాహెగ్డే కూడా ఈ షెడ్యూల్ లో ఉంది. ఇద్ద‌రిపై రొమాంటిక్ నెంబ‌ర్ చిత్రీక‌రిస్తున్నాడు త్రివిక్ర‌మ్. మ‌రో మూడు రోజుల్లో ఈ పాట చిత్రీక‌ర‌ణ పూర్తి కానుంది. అక్టోబ‌ర్ తొలి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి.. 11న‌ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి తాము కూడా మామూలు మ‌నుషుల‌మే అని మ‌ళ్లీ మ‌ళ్లీ నిరూపిస్తున్నారు మ‌న హీరోలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here