అర‌వింద స‌మేత లెక్క‌లేంటి..? ఎంత తేవాలి..?

ఇప్పుడు అంద‌రిలోనూ ఒక్క‌టే అనుమానం.. అర‌వింద స‌మేత ఎలా ఉండ‌బోతుంది..? ట‌్రైల‌ర్ లో అయితే కొత్త‌గా ఏం క‌నిపించ‌లేదు. అలాగ‌ని మ‌రీ చెత్త‌గా అయితే లేదు. ఇదివ‌ర‌కు వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమాల‌నే మ‌ళ్లీ తీస్తున్నాడు త్రివిక్రమ్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అంతా యుద్ధాల‌ను చూపించారు కానీ త్రివిక్ర‌మ్ మాత్రం యుద్ధం త‌ర్వాత వ‌చ్చే శాంతిని చూపిస్తున్నాడు. ఇదే ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

ARAVINDA SAMETHA

మాట‌ల మాంత్రికుడు క‌చ్చితంగా ఏదో మాయ చేస్తాడ‌నే అంతా న‌మ్ముతున్నారు. దీనికి జ‌రుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బుర్ర గిర్రున తిర‌గ‌డం ఖాయం. ఎందుకంటే ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 90 కోట్ల‌కు పైగానే బిజినెస్ చేస్తున్నారు. అంటే హిట్ కావాల‌న్నా కూడా 100 కోట్లు రావాల్సిందే. భ‌ర‌త్ అనే నేనుకు 94 కోట్లు వ‌చ్చినా కూడా అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 93 కోట్ల‌కు అమ్మేసారు.

అజ్ఞాత‌వాసి ఏమైందో అంద‌రికి తెలిసిందే. జై ల‌వ‌కుశ కూడా 75 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసినా యావ‌రేజ్ గానే నిలిచింది. దానికి కార‌ణం కూడా భారీ బిజినెస్సే. ఇప్పుడు అర‌వింద స‌మేతను కూడా భారీగానే అమ్మేస్తున్నారు. మ‌రి బ‌య్య‌ర్ల‌ను అర‌వింద స‌మేత ఎంత‌వ‌ర‌కు బ‌య‌ట ప‌డేస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ద‌స‌రా హాలీడేస్ ఉన్నాయి కాబ‌ట్టి కాస్త బాగున్నా కూడా సినిమాకు జ‌నాలు పోటెత్త‌డం ఖాయం. పైగా ఇప్పుడు సెంటిమెంట్ కూడా న‌డుస్తుంది ఈ సినిమాపై. తండ్రి సెంటిమెంట్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. అన్నింటికీ మించి ఎన్టీఆర్ ఇప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. నైజాంలోనే 19.50 కోట్ల‌కు అమ్మేసారు సినిమాను. దాంతోపాటు అన్నిచోట్లా బిజినెస్ కుమ్మేసింది. దాంతో క‌చ్చితంగా అర‌వింద స‌మేత జ‌రిగిన బిజినెస్ తో పాటు లాభాలు కూడా తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నారు నిర్మాత‌లు. అక్టోబ‌ర్ 11న దాదాపు 2500 థియేట‌ర్స్ లో వ‌స్తుంది ఈ చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *