అర‌వింద స‌మేత టాక్ ఏంటో తెలుసా..?

ది మోస్ట్ అవైటెడ్.. ఆంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయ‌ర్ అర‌వింద స‌మేత విడుద‌లైంది. ఓవ‌ర్సీస్ నుంచి ఈ చిత్ర టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన రిపోర్ట్స్ ప్ర‌కారం అర‌వింద స‌మేత క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అజ్ఞాతవాసిలో మిస్ అయిన కంటెంట్ అంతా ఇందులో త్రివిక్ర‌మ్ నింపుకుని వ‌చ్చాడ‌ని అంటున్నారు ప్రేక్ష‌కులు. మ‌రోసారి రొటీన్ క‌థ‌తోనే వ‌చ్చినా కూడా మార్క్ స్క్రీన్ ప్లే సినిమాకు హెల్ప్ అయింద‌ని.. త్రివిక్ర‌మ్ దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లిపోయాడ‌ని చెబుతున్నారు. ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడా చాలా వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అయిందనే టాక్ వినిపిస్తుంది.

aravindha-sametha-first-talk
మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ లో ఫాద‌ర్ డెత్ సీన్ తో పాటు మ‌రి కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమా స్థాయిని పెంచేసాయంటున్నారు ఆడియ‌న్స్. ఫ‌స్ట్ హాఫ్ అంతా డీసెంట్ గా సాగినా.. సెకండాఫ్ ఎమోష‌న‌ల్ గా న‌డిపించాడు త్రివిక్రమ్. ఇంట‌ర్వెల్ సీన్ నుంచి సినిమా రేంజ్ మారిపోతుంద‌ని చెబుతున్నారు. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా అభిమానుల‌కు పూన‌కాలు తెప్పిస్తుంద‌ని తెలుస్తుంది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త స్లో అయినా క‌థ ఉండ‌టంతో అది న‌డిచిపోతుంద‌ని.. ఫ‌స్టాఫ్ లో ఎన్టీఆర్, సునీల్ మ‌ధ్య కామెడీ ట్రాక్ బాగా వ‌ర్కవుట్ అయింద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. జ‌గ‌ప‌తిబాబు, సుప్రియ ప‌గ‌త్, పూజాహెగ్డే కూడా చాలా బాగా చేసారంటున్నారు ప్రేక్ష‌కులు. మొత్తానికి ద‌స‌రాకు బాక్సాఫీస్ స‌ర‌దా తీర్చ‌డానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here