అర‌వింద స‌మేత‌ నో ఆడియో, డైరెక్ట్ ప్రీ రిలీజ్.

నంద‌మూరి అభిమానుల క‌న్ను ఇప్పుడు అర‌వింద స‌మేత‌పైనే ఉంది. ఎన్టీఆర్ హీరోగా వ‌స్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని చూస్తున్నారు అభిమానులు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ కూడా ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా దాదాపు అయిపోయింది. అర‌వింద స‌మేత మొద‌లైన కొత్త‌లో కొన్ని విభేధాలు వ‌చ్చాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై ఎన్టీఆర్ ఆస‌క్తిగా లేడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే త‌ర్వాత త‌ర్వాత త్రివిక్ర‌మ్ దాన్ని క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చాడు. ఇక ఇప్పుడు పూర్తిగా అర‌వింద స‌మేత‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నాడు యంగ్ టైగ‌ర్. ఇలాంటి టైమ్ లో ఆయ‌న తండ్రి చ‌నిపోవ‌డం అనూహ్యం. దాంతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా ఎన్టీఆర్ షాక్ లోకి వెళ్లిపోయాడు.
Audio Release Event Cancelled For Aravinda Sametha
Audio Release Event Cancelled For Aravinda Sametha
అందుకే ఈ క‌ష్ట స‌మ‌యంలో అర‌వింద స‌మేత వేడుక‌లు చేయ‌డం కూడా మంచిది కాద‌ని టీం భావిస్తున్నారు. అందుకే సెప్టెంబ‌ర్ 20 నేరుగా మార్కెట్ లోకి పాట‌లు విడుద‌ల చేస్తున్నారు. అయితే విడుద‌ల‌కు ముందు ఓ భారీ ఈవెంట్ చేయ‌నున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే షూటింగ్ కూడా త్వ‌ర‌గా పూర్తి చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు జూనియ‌ర్ ఉన్న ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఒక్క‌సారి ప్యాక‌ప్ చెప్పిన త‌ర్వాత ఎన్టీఆర్ ను పూర్తిగా వ‌దిలేస్తున్నాడు. ఇలా ఇద్ద‌రూ ఇప్పుడు ఓ అండ‌ర్ స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారు. అక్టోబ‌ర్ 10న‌ ద‌స‌రా కానుక‌గా అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here