ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు..

షాకులు కేకులు తినిపిస్తున్న‌ట్లు తినిపిస్తున్నాడు ఎన్టీఆర్ త‌న అభిమానుల‌కు. అర‌వింద స‌మేత‌తో ఎన్నో అంచ‌నాల‌తో ఉన్న ఫ్యాన్స్ కు ఒక్కోరోజు ఒక్కో షాక్ ఫ్రెష్ గా త‌గులుతుంది. ఇన్నాళ్లూ ఆడియో వేడుక ఉంటుంది అనుకున్నారు.. అది లేదు. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అర‌వింద స‌మేత ఆడియో వేడుక‌లు చేయ‌డం కూడా మంచిది కాద‌ని టీం భావిస్తున్నారు.

ARAVINDA SAMETHA

దానికి అభిమానులు కూడా ఓకే అనేసారు.. ఎందుకంటే ఇలాంటి టైమ్ లో అది మంచిది కాద‌ని వాళ్లు కూడా తెలుసు. అందుకే సెప్టెంబ‌ర్ 20 నేరుగా మార్కెట్ లోకి పాట‌లు విడుద‌ల చేస్తున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్సులు చేయ‌డు.. అస‌లు ఈయ‌న డాన్సులు చూసే భాగ్యం సినిమాలో లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇదేంటి ఎన్టీఆర్ డాన్సులు లేక‌పోతే ఎలా అని అంతా అనుకున్నారు కానీ ఇదే నిజం.

ఎందుకంటే సినిమాలో ఉన్న‌దే నాలుగు పాట‌లు. అందులో ఒక్క‌టి మెలోడి.. అది ఇప్ప‌టికే విడుద‌లైంది. ఇక మూడు పాట‌లు అన్నీ రాయ‌ల‌సీమ గురించి చెప్పేవే. పెనివిటి.. ఏడ పోయినాడో.. రెడ్డి అక్క‌డ సూడు పాట‌లు పూర్తిగా సీమ నేప‌థ్యంలో వ‌చ్చే పాట‌లే. ఇక ఇప్పుడు తాజాగా త‌గులుతున్న మ‌రో షాక్ ఏంటంటే టైమ్ లేక ఇందులో ఓ పాట చిత్రీక‌ర‌ణ ఆపేస్తున్నారు. ఐదు పాట‌లు ఉన్న సినిమా కాస్తా ఇప్పుడు నాలుగు పాట‌ల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏ రిస్క్ ఇప్పుడు తీసుకోవ‌డం లేదు త్రివిక్ర‌మ్. ఇలా ఇద్ద‌రూ ఇప్పుడు ఓ అండ‌ర్ స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారు. అక్టోబ‌ర్ 10న‌ ద‌స‌రా కానుక‌గా అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here