అంత‌రిక్షం.. లెక్క దారుణంగా త‌ప్పిన‌ట్లుందిగా..

కొన్ని సినిమాలు చేసిన‌పుడు హిట్ గురించి ఆలోచించ‌కూడ‌దు. ప్ర‌య‌త్నం చేయాల‌నుకున్న‌పుడు చేయాలంతే.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కూడా అంత‌రిక్షం విష‌యంలో ఇదే చేసాడు. ఇలాంటి సినిమా చేస్తే రిస్క్ అని తెలిసి కూడా చేసాడు. మంచి పేరు అయితే వ‌చ్చింది కానీ ఇప్పుడు కోరిన విజ‌యం మాత్రం వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

Antariksham First Day Box office Collections

ఈ చిత్రానికి తొలిరోజు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. దాంతో అదే ప్ర‌భావం వసూళ్ల‌పై ప‌డింది. అంత‌రిక్షంకు తొలిరోజు కేవ‌లం కోటిన్న‌ర షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. తొలిప్రేమ సినిమాతో 10 నెల‌ల కిందే తొలిరోజు 4 కోట్లు వ‌సూలు చేసాడు వ‌రుణ్ తేజ్. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. అస‌లు అంత‌రిక్షం సినిమాకు ఇంత త‌క్కువ ఓపెనింగ్స్ రావ‌డం ట్రేడ్ ను కూడా ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తుంది. అంతా విజ‌యాల్లో ఉన్న టీం క‌లిసి చేసిన సినిమాకు కూడా దారుణ‌మైన ఓపెనింగ్స్ రావ‌డం ఆశ్చ‌ర్య‌మే. పోనీ రెండోరోజు అయినా ప‌రిస్థితి మెరుగు ప‌డుతుందేమో అనుకుంటే అంత‌కంటే దారుణంగా మారిపోయింది.

అంత‌రిక్షం క‌థ బ‌లంగా లేక‌పోవ‌డం మైన‌స్ గా మారింది. కాక‌పోతే ప్ర‌య‌త్నం బాగుంది కాబ‌ట్టి అది ఒక్క‌టే సినిమాను ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఘాజీ సినిమాకు ఇండో పాక్ క‌థ బాగా సెట్ అయింది.. ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంది.. అద్భుత‌మైన క‌థ కూడా కుదిరింది.. అన్ని ఉన్నాయి కాబ‌ట్టి ఘాజీ అంత పెద్ద విజ‌యం సాధించింది. కానీ ఇప్పుడు అంత‌రిక్షం అలా కాదు.. ఇది సంక‌ల్ప్ రాసుకున్న క‌ల్పిత‌క‌థ. బ‌ల‌మైన పాయింట్స్ లేక ఈ చిత్రం స్లో నెరేష‌న్ తో స్పేస్ లోనే అటూ ఇటూ ఊగుతూ నిల‌బ‌డిపోయింది. మొత్తానికి ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాల‌న్న వ‌రుణ్ తేజ్ ఆశ‌ల‌కు కొన్ని రోజులు బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ ఎప్పుడు అలాంటి అవ‌కాశం వ‌స్తుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here