దండాల‌య్యా దండాల‌య్యా నీకు ఓ అమితాబ్..

ఎందుకు ఇప్పుడు ఆయ‌న‌కు దండాలు అనుకుంటున్నారా..? అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌య‌సు 75 కు చేరువ‌గా ఉంది. ఇప్పుడు ఆయ‌న నుంచి యాక్ష‌న్ సినిమా ఊహించ‌డం సాధ్య‌మేనా..? అస‌లు ఈయ‌న ఇన్ని సినిమాలు చేస్తుండ‌ట‌మే ఆశ్చ‌ర్యం అంటే ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న దూకుడు చూస్తుంటే షాక్ త‌ప్ప‌దు.

AMITABH BACHCHAN

అయినా బిగ్ బి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 45 ఏళ్లైపోయింది. ఇంకా ఏముంటుంది ఆయ‌న్ని కొత్త‌గా చూపించ‌డానికి.. ఆయ‌న గురించి కొత్త‌గా చెప్ప‌డానికి.. ఏం చేసినా ఇదివ‌ర‌కు చేసారు క‌దా అంటారు. ఇలాంటి టైమ్ లో కూడా త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు చేస్తున్నాడు ఈయ‌న‌. బాలీవుడ్ మెగాస్టార్ ఆలోచ‌న‌లు చూస్తుంటే ఇప్ప‌టి హీరోలు కుళ్లుకుని చ‌చ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ల‌కు కూడా రాని ఆలోచ‌న‌లు ఈయ‌న‌కు వ‌స్తున్నాయి. అక్క‌డికి కూడా రాని క‌థ‌లు ఈయ‌న్ని వెతుక్కుంటూ వ‌స్తున్నాయి క‌దా. మొన్న‌టికి మొన్న 102 నాటౌట్ చేసాడు. దానికి ముందు కూడా తీన్ ప‌త్తి లాంటి సినిమా చేసాడు. ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్.. సైరా లాంటి సినిమాల్లోనూ డిఫెరెంట్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్. అస‌లు ఈయ‌న దూకుడు చూస్తుంటే అబ్బో అద్భుతం అనిపించ‌క మాన‌దు. మ‌రి అమితాబ్ ర‌చ్చ ఎప్ప‌టికి ఆగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here