అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ఏదో చేసేలా ఉందే..!

శీనువైట్ల సినిమా అంటే ఒక‌ప్పుడు ఉన్న అంచ‌నాలు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం కూడా అవ‌స‌రం లేదు. ఆగ‌డు.. బ్రూస్లీ.. మిస్ట‌ర్ సినిమాల‌ను చూపిస్తే చాలు. దానికి ముందు బాద్షా కూడా పెద్ద హిట్ ఏం కాదు. జ‌స్ట్ యావ‌రేజ్. దూకుడుతో ఒక్క‌సారిగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయిన శీనువైట్ల‌.. ఆ త‌ర్వాత మాత్రం అంచ‌నాలు అందుకోలేక వ‌ర‌స‌గా చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నాడు.

మిస్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న జాత‌కం పూర్తిగా తిర‌గ‌బ‌డిపోయింది. దాంతో మ‌ళ్లీ త‌న కెరీర్ ను గాడిన పెట్టుకోడానికి ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంటూ వ‌స్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే శీనువైట్ల పూర్తిగా మారిపోయిన‌ట్లే అనిపిస్తుంది.

ఎందుకంటే ఇదివ‌ర‌కటి మాదిరి రొటీన్ గా అయితే లేదు ఫ‌స్ట్ లుక్. ఒకే పోస్ట‌ర్ లో ముగ్గురు ర‌వితేజ‌ల‌ను చూపిస్తూ కావాల్సినంత క్యూరియాసిటీ పెంచుతున్నాడు శీనువైట్ల‌. ఒక్క‌డే ముగ్గురు ఎందుకు అయ్యాడు అనేది థియేట‌ర్ కి వ‌చ్చి తెలుసుకోండి అంటున్నాడు. పైగా ఈ చిత్రంలో సునీల్ ఉన్నాడు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వ‌స్తుంది. ఇప్ప‌టికైతే ఫ‌స్ట్ లుక్ తోనే సినిమాపై ఆస‌క్తి అయితే పెంచేసాడు.

మ‌రి ఇదే ఊపు త‌ర్వాత కూడా కొన‌సాగుతుందా.. సినిమాలోనూ ఇంతే మ్యాట‌ర్ ఉంటుందా లేదా అనేది అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు ఆగితే తెలుస్తుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here