అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రిలీజ్ ఎప్పుడంటే..?

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్రంలో ర‌వితేజ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు శీనువైట్ల‌. అక్టోబ‌ర్ 29న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇందులో ర‌వితేజ మ‌ల్టిపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ తో బాధ ప‌డే పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Amar Akbar Anthony

అందుకే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీగా మారిపోతుంటాడ‌ని తెలుస్తుంది. టీజ‌ర్ ఓకే కానీ విడుద‌ల తేదీని మాత్రం ఇంకా అనౌన్స్ చేయ‌డం లేదు నిర్మాత‌లు. ఎందుకంటే అక్టోబ‌ర్ 5 అని ముందు అనుకున్నా.. ఇప్పుడు డిసెంబ‌ర్ కు వెళ్లిపోయారు. కానీ వ‌ర‌స‌గా సినిమాలు ఉండ‌టంతో ఏ తేదీలో రావాలో అర్థం కావ‌డం లేదు. న‌వంబ‌ర్ 2న స‌వ్య‌సాచి.. 6న స‌ర్కార్.. 16న టాక్సీవాలా.. 29న 2.0 విడుద‌ల కానున్నాయి.

ర‌జినీ సినిమా అంటే క‌నీసం 20 రోజులు ఆ ప్ర‌భావం ఉంటుంది కాబ‌ట్టి ర‌వితేజ‌కు స‌రైన విడుద‌ల తేదీ దొర‌క‌డం లేదు. అలాగ‌ని హ‌డావిడిగా వ‌స్తే అత‌డికే న‌ష్టం. ఎందుకంటే ప్ర‌స్తుతం శీనువైట్ల‌తో పాటు మాస్ రాజా కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ఆగ‌డు.. బ్రూస్లీ.. మిస్ట‌ర్ తో శీనువైట్ల పూర్తిగా వెన‌క‌బ‌డిపోయాడు. దానికి ముందు బాద్షా కూడా జ‌స్ట్ యావ‌రేజ్. దూకుడుతో ఒక్క‌సారిగా స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయిన శీనువైట్ల‌.. ఆ త‌ర్వాత మాత్రం అంచ‌నాలు అందుకోలేక వ‌ర‌స‌గా చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నాడు. మిస్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న జాత‌కం పూర్తిగా తిర‌గ‌బ‌డిపోయింది. దాంతో మ‌ళ్లీ త‌న కెరీర్ ను గాడిన పెట్టుకోడానికి ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంటూ వ‌స్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే శీనువైట్ల పూర్తిగా మారిపోయిన‌ట్లే అనిపిస్తుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వ‌స్తుంది. ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌రి చూడాలిక‌.. అన్నీ చూసుకుని ఎప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రానున్నారో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *