చిరంజీవి ఏంట్రా.. అభిమానుల‌కు బ‌న్నీ క్లాస్..

ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు బ‌న్నీ. ఇదివ‌ర‌కు మ‌న‌కు క‌నిపించిన అల్లు అర్జున్ కంటే ఇప్పుడు మ‌రోలా ఉన్నాడు. ఈయ‌న మాట తీరు కూడా మారిపోయింది. ఇప్పుడు అంద‌ర్నీ గారూ అంటూ సంబోదిస్తున్నాడు. ఇప్పుడు మ‌రోసారి అదే క్లాస్ పీకాడు కూడా.

Allu Arjun Superb Speech at Padi Padi Leche Manasu Event

తాజాగా ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చిన బ‌న్నీ.. అక్క‌డ ఫ్యాన్స్ అరుస్తుంటే కాస్త స‌ముదాయించాడు. ఆ త‌ర్వాత త‌న క్లాస్ మొద‌లు పెట్టాడు. శ‌ర్వాగారూ అంటూ మొద‌లుపెట్టి.. నేనెందుకు గారూ అంటున్నానంటే అంటూ మొద‌లుపెట్టాడు. శ‌ర్వానంద్ త‌న‌కంటే చిన్న వాడే అయినా కూడా మీరంతా ఎంతో గౌర‌విస్తారు.. అభిమానిస్తారు క‌దా అలాంటి వాడిని నేను గారూ అన‌డ‌మే క‌రెక్ట్ అన్నాడు బ‌న్నీ.

అంతేకాదు మీరు కూడా క‌చ్చితంగా అంద‌ర్నీ గారూ అని పిల‌వండి అంటూ అభిమానుల‌కు చెప్పాడు బ‌న్నీ. రాజ‌కీయ నాయ‌కుల‌ను, సినిమా వాళ్ల‌ను త‌క్కువ చేయాల‌ని.. గౌరవం ఇవ్వ‌కూడ‌ద‌ని ఎక్క‌డా లేద‌ని చెప్పాడు బ‌న్నీ. క‌చ్చితంగా అంద‌ర్నీ ఒకేలా చూడాల‌ని.. గౌర‌వం ఇచ్చి తీరాల్సిందే.. గారు అనాల్సిందే అని చెప్పాడు అల్లు అర్జున్. ఈయ‌న స్పీచ్ తో అక్క‌డున్న అభిమానులు కూడా కాస్త షాక్ అయినా మంచి విష‌య‌మే చెప్పాడు క‌దా అని స‌ర్దుకున్నారు. మొత్తానికి ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బ‌న్నీ మాత్రం చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *