అక్ష‌య్ చేతిలో బాలీవుడ్ క‌త్తి..

చిరంజీవిని ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా చేసిన సినిమా కత్తి. ఇదే రీమేక్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం త‌మిళ‌నాట సంచ‌లన విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత తెలుగులో కూడా చిరంజీవి చేస్తే ఇక్క‌డా విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అక్క‌డ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర హ‌క్కుల్ని దక్కించుకున్నాడు.

పద్మావత్ త‌ర్వాత ఏ సినిమా అనౌన్స్ చేయని ఈ ద‌ర్శ‌కుడు.. క‌త్తిని బాలీవుడ్ లో దించ‌డానికి చూస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఆయ‌నే తెర‌కెక్కిస్తాడా.. లేదంటే మ‌రో ద‌ర్శ‌కుడికి ఇచ్చి కేవ‌లం నిర్మాత‌గా ఉంటారా అనేది మాత్రం స‌స్పెన్స్. రైతు సమస్యలపై తెరకెక్కిన కత్తి రికార్డుల‌తో పాటు అవార్డులు కూడా తీసుకొచ్చింది. అప్ప‌ట్లో విక్రమార్కుడు రీమేక్ రైట్స్ కొనేసి ప్ర‌భుదేవా చేతికి ఇచ్చాడు. రౌడీరాధోర్ అంటూ చేసి హిట్ కొట్టాడు.

ఆ త‌ర్వాత కూడా ఠాగూర్ రీమేక్ రైట్స్ తీసుకుని క్రిష్ కు ఇచ్చి గ‌బ్బ‌ర్ తో హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా ఇదే చేయ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌త్తి రీమేక్ రైట్స్ తీసుకుని ఓ ద‌ర్శ‌కుడికి ఇచ్చి మ‌ళ్లీ ఎప్ప‌ట్లాగే అక్ష‌య్ కుమార్ నే హీరోగా తీసుకోవాల‌నుకుంటున్నాడు. ఇప్ప‌ట్లో మురుగ‌దాస్ అయితే హిందీలో రీమేక్ చేసే ఉద్దేశ్యంలో లేడు. ఈయ‌న ప్ర‌స్తుతం విజ‌య్ స‌ర్కార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here