చిరు హ్యాండిచ్చాడు.. అఖిల్ ఆద‌రించాడు..

ప‌ట్టుమ‌ని పాతికేళ్లు కూడా లేని అఖిల్ ను తీసుకెళ్లి ఇప్పుడు బోయ‌పాటి చేతుల్లో పెడుతున్నాడు నాగార్జున‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌లు అయితే ఇవే. ఈయ‌న త‌ర్వాతి సినిమా ఆయ‌న‌తోనే ఉంటుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉన్న బోయ‌పాటి శీను.. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తో పాటు ఎల‌క్ష‌న్స్ కూడా ఉన్నాయి కాబ‌ట్టి ఉన్న‌ట్లుండి ఒకేసారి బాల‌య్య అన్నీ వ‌దిలేసి బోయ‌పాటి వైపు వ‌స్తాడా అనేది అనుమాన‌మే. అందుకే అఖిల్ కోసం క‌థ రాస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ అంటే క్లాస్ సినిమాలు.. ప్రేమ‌క‌థ‌లు.. కానీ అఖిల్ మాత్రం దీన్ని వినిపించుకోవడం లేదు. మాస్ ఇమేజ్ కోసం మొద‌టి సినిమా నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు.

akhil

అఖిల్ ఫ్లాప్ అయినా.. హ‌లోతో ల‌వ‌ర్ బాయ్ అనిపించుకున్నాడు. ఇప్పుడు వెంకీ అట్లూరితో మ‌రో ప్రేమ‌క‌థ చేస్తున్నాడు. కానీ త‌ర్వాత మ‌ళ్లీ మాస్ మాస్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు. హీరోల‌కు మాస్ ఇమేజ్ తీసుకురావ‌డంలో ముందుండే ఈ త‌రం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. అందుకే అఖిల్ ను ఆయన చేతుల్లో పెడుతున్నార‌నే టాక్ కూడా వినిపిస్తుంది.

నాగార్జున ఇచ్చిన ఆఫ‌ర్ కు బోయ‌పాటి కూడా ఓకే అన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌ కోసం క‌థ సిద్ధం చేస్తున్న బోయ‌పాటి.. ఆ త‌ర్వాత అఖిల్ ను లైన్ లో పెడ‌తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి బాల‌య్య కంటే ముందే బోయ‌పాటితో అఖిల్ సినిమా ఉంటుందా లేదంటే త‌ర్వాత చేస్తాడా అనేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here