అనుకున్న‌దే.. అఖిల్ త‌ప్పుకున్నాడుగా..

అస‌లే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ సినిమా మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తవుతుంది. ఈ మ‌ధ్యే లండ‌న్ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు అఖిల్. ఇప్ప‌టికే హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ అక్క‌డ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌చ్చేసింది. మొన్నీమ‌ధ్యే అఖిల్ కూడా వ‌చ్చాడు.

akhil

వ‌చ్చిన త‌ర్వాత కుటుంబంతో క‌లిసి హాయిగా ఫారెన్ టూర్ వెళ్లాడు అఖిల్. ముందు నుంచీ కూడా ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది అఖిల్ ప్లాన్. అది కుద‌ర్లేదు.. ఆ త‌ర్వాత‌ డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. కానీ ఇప్పుడు అది కూడా కుద‌ర‌ద‌ని అర్థం అయిపోయింది. పైగా అదే నెల్లో వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షంతో పాటు శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు కూడా విడుద‌ల కానుంది. దాంతో మ‌నోడు ఏకంగా వ‌చ్చే ఏడాదికి త‌న సినిమా వాయిదా వేసుకున్నాడు.

ఈ ఏడాది తొలిప్రేమ‌ను విడుద‌ల చేసిన ఫిబ్ర‌వ‌రిలోనే మ‌రోసారి త‌న సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. ఇప్ప‌టికే షూటింగ్ 80 శాతం పూర్తైపోయింది. చిన్న బ్రేక్ తీసుకుని హైద‌రాబాద్ లో మ‌రో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో అఖిల్ తో జోడీ క‌ట్టింది. మ‌రి చూడాలిక‌.. మిస్ట‌ర్ మ‌జ్నుగా అఖిల్ ఎలాంటి మాయ చేయ‌బోతున్నాడో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *