అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను సాంగ్.. నువ్వెటో నేనెటో మ‌నసెటో

ఇప్పుడు పాట మాదిరే ఉంది అఖిల్ కెరీర్ కూడా. ఆయ‌న కెరీర్ ఎటెటో వెళ్తుంది. ఇటు అటు అంటూ ఎటెటో క‌దిలిపోతుంది. కానీ హిట్ మాత్రం రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ సినిమా మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో.3

Akhil Mr Majnu Movie Song Review

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది కూడా. తొలిప్రేమ మాదిరే ఈ చిత్ర షూటింగ్ కూడా 70 శాతం లండ‌న్ లోనే జ‌రిగింది. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వ‌ల్ హీరోయిన్. అన్న‌య్య‌తో రొమాన్స్ త‌ర్వాత ఇప్పుడు త‌మ్ముడుతో రొమాన్స్ చేస్తుంది నిధి. ఇప్పుడు ఈ చిత్రంలోని పాట విడుద‌లైంది.

థ‌మ‌న్ మ‌రోసారి తొలిప్రేమ మాదిరే కాస్త కొత్త ట్యూన్ ఇచ్చాడు. పాత థ‌మ‌న్ మాదిరి కాకుండా కొత్త‌గా ఆలోచించాడు. వెంకీ అట్లూరి ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ మ‌రోసారి మంచి పాటే ఇచ్చాడు ఈ కుర్ర సంగీత త‌రంగం. నువ్వెటో నేనెటో మ‌న‌సెటో అంటూ సాగే ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మిస్ట‌ర్ మ‌జ్నుగా అఖిల్ క‌చ్చితంగా మాయ చేస్తాడ‌ని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ.

ఇందులో ప్లే బాయ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు అఖిల్. అక్కినేని వార‌సుడు కోరుకుంటున్న‌ట్లుగానే ప‌క్కా రొమాంటిక్ ఇమేజ్ వ‌చ్చేలా ఈ కారెక్ట‌ర్ డిజైన్ చేసాడు వెంకీ. ఇది వెంకీ అట్లూరి కెరీర్ కు కూడా కీల‌క‌మే. ఇది కానీ హిట్టైందంటే అఖిల్ కెరీర్ నిల‌బ‌డ‌ట‌మే కాదు.. వెంకీ కూడా క్రేజీ డైరెక్ట‌ర్ అయిపోతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *