హ‌న్సిక 50 సినిమాలు పూర్తి చేసిందా.. షాక్ లో ఫ్యాన్స్..

తొలి సినిమా దేశ‌ముదురు చూసిన‌పుడు అస‌లు ఈ హీరోయిన్ ను ఎవ‌రు తీసుకొచ్చారు సామి.. క‌నీసం మొహంలో ఎక్స్ ప్రెష‌న్ కూడా లేదు.. న‌వ్వు ఏడుపు రెండూ ఒకేలా ఉన్నాయ‌న్నారు. కేవ‌లం అందాలు ఉంటే స‌రిపోతుందా హీరోయిన్ గా సెట్ అయిపోతుందా అని హేళ‌న చేసారు. కానీ ఇప్పుడు ఇదే అమ్మాయి ఒక‌టి రెండు కాదు.. 50 సినిమాలు పూర్తి చేసింది. అస‌లు ఊహించ‌డానికి కూడా చాలా విచిత్రంగా అనిపించే విష‌యం ఇది.

Hansika
Hansika

హ‌న్సిక 50 సినిమాలు పూర్తి చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. మిగిలిన హీరోయిన్ల మాదిరి ఎప్పుడూ ప‌ర్ఫార్మెన్స్ ను న‌మ్ముకోలేదు ఈ భామ‌. ఎంత‌సేపు అందాల‌పైనే ఫోక‌స్ చేసింది. ఇప్ప‌టికీ ఇదే చేస్తుంది కూడా. త‌మిళ‌నాట ఓ టైమ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా కూడా ఏలేసింది ఈ భామ‌. వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టిస్తూ చ‌క్రం తిప్పింది. పైగా ఆమెకు గుడి కూడా క‌ట్టారు అభిమానులు.

ఇదిలా ఉంటే ఇప్పుడు హ‌న్సిక ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై తాను అస్స‌లు ఎక్స్ పోజింగ్ చేయ‌న‌ని చెప్పింది హ‌న్సిక. పాతికేళ్ల‌కే ఆంటీలా మారిపోవ‌డంతో తెలుగులో అస‌లు అవ‌కాశాలు రావ‌డ‌మే క‌ష్ట‌మైపోయాయి. కానీ ఇప్పుడు మ‌ళ్లీ బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీ అయిపోయింది హ‌న్సిక‌. పూర్తిగా బ‌రువు త‌గ్గిపోయి.. మెరుపుతీగ‌లా మారిన హ‌న్సిక‌ను కూడా ఔరా అనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

చ‌క్క‌న‌మ్మా చిక్కినా అంద‌మే అన్న‌ట్లు హ‌న్సిక ఎలా ఉన్నా కూడా అందాల ముద్దుగుమ్మే. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన 50వ సినిమా మ‌హా లుక్ విడుద‌లైంది. ఇందులో చాలా స‌న్న‌గా మారింది హ‌న్సిక‌. ఈ లుక్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. గంజాయి తాగుతూ మాత‌లా కూర్చుంది హ‌న్సిక‌. అన్న‌ట్లుగానే ఈ చిత్రంలో గ్లామ‌ర్ అయితే ఒల‌క బోయ‌లేదు హ‌న్సిక‌. మొత్తానికి 50 సినిమాలు పూర్తి చేసి అద్భుత‌మైన రికార్డ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Hansika 5oth Movie Maha Poster
Hansika 5oth Movie Maha Poster

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *