వాళ్ల‌ను జంగిల్ ఫెలోస్ అంటున్న రామ్..

ప్ర‌ణ‌య్-అమృత‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్ద‌రి పేర్లు తెలియ‌ని వాళ్లుండ‌రు. నార్త్ లో ఎక్కువ‌గా చూసే ప‌రువు హ‌త్య‌ల‌ను సౌత్ కు కూడా ప‌రిచ‌యం చేసింది ఈ జంట‌. ముచ్చ‌ట‌గా ఉన్న ఈ జంట‌ను అమృత వాళ్ల నాన్నే విడ‌దీసాడు. ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే ప్ర‌ణ‌య్ ను చంపించాడు.

ఈ విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది. దీనికి రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినిమా వాళ్లు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు రామ్ కూడా దీనిపై క‌మెంట్ చేసాడు. ఈ రోజుల్లో కూడా ప‌రువు హ‌త్య‌లేంట్రా జంగిల్ ఫెలోస్.. బ‌త‌క‌డం కాస్తైనా నేర్చుకోండి అంటూ సీరియ‌స్ అయ్యాడు. ఈ మ‌ధ్యే గే క‌ల్చ‌ర్ ను ప్రోత్స‌హిస్తూ సుప్రీం కోర్ట్ సెక్షన్ 377 కూడా ఎత్తేశారు.

 

ఇలాంటి స‌మ‌యంలో కూడా ఇంకా కులాలు పట్టుకుని వేలాడడం ఏంట్రా.. అడ‌వి మ‌నుషుల కంటే దారుణంగా ఉన్నారు క‌దరా అంటూ రామ్ మండిపడ్డాడు. కులాలు, పరువు హత్యలు ఇందిరా ఇది జంగిల్ ఫెలోస్ అంటూ రామ్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రణయ్, అమృత ప్రేమ‌ను గుండె చీలిపోయింది అంటూ రాసుకొచ్చాడు. క‌నీసం వీళ్ల విషాదాంత ప్రేమ చూసిన త‌ర్వాతైనా మ‌నుషులుగా బ‌త‌కడం నేర్చుకోండ్రా అంటూ ట్వీట్ చేసాడు. ఇదే ఘ‌ట‌న‌పై సింగ‌ర్ చిన్మ‌యి కూడా స్పందించింది.

కులాన్ని నిర్మూలించండి.. పేరు చివ‌ర ఉన్న తోక‌లు క‌త్తిరించండి అంటూ రాసుకొచ్చింది ఈ భామ‌. ఇక కేటీఆర్ కూడా ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై స్పందించాడు. వాళ్ల కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపాడు.. దోశుల‌ను శిక్షిస్తాం అని ట్వీట్ చేసాడు. మొత్తానికి ఈ ఒక్క హ‌త్య‌తో ఇప్పుడు మ‌ళ్లీ దుమారం రేగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here