బాహుబ‌లిపై క‌న్నేసిన అమీర్ ఖాన్..

అమీర్ ఖాన్ కు రికార్డులు అంటే పిచ్చి లేదంటాడు కానీ ఒక్క‌సారి త‌న చేతుల్లోంచి జారిపోయిన రికార్డులు మ‌ళ్లీ త‌న చేతికి వ‌చ్చేంత వ‌ర‌కు క‌నీసం నిద్ర కూడా పోడేమో..? ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు అమీర్. ఎక్క‌డో తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన బాహుబ‌లి బాలీవుడ్ రికార్డుల‌న్నింటినీ త‌న గుప్పిట్లో ఉంచుకుంటే అమీర్ చూస్తూ ఉండ‌లేక‌పోతున్నాడు.

AAMIR-KHAN-THUGS-OF-HINDOSTAN

అందుకే వీలైనంత త్వ‌ర‌గా వ‌చ్చి ఆ రికార్డుల‌ను విడిపించాల‌ని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో వ‌స్తున్నాడు అమీర్ ఖాన్. ఈ చిత్ర ట్రైల‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దివాళీకి అన్ని రికార్డులు బ్రేక్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

అమితాబ్, క‌త్రినా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ధూమ్ 3 ఫేమ్ విజ‌య్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక్క షెడ్యూల్ కోసం ఆ మ‌ద్య 80 కోట్లు ఖ‌ర్చు చేసారు. సాహో కోసం 90 కోట్లు ఖ‌ర్చు చేస్తే అంత‌కంటే ప‌ది కోట్లు త‌క్కువే ఇది. బ‌డ్జెట్ విష‌యంలోనూ సాహో హ‌ద్దులు దాటేస్తుంది. ఈ చిత్రం దాదాపు 300 కోట్ల‌తో తెర‌కెక్కుతుంటే.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ బ‌డ్జెట్ 250 కోట్ల వ‌ర‌కు ఉంది. 1795లో బ్రిటీష్ వాళ్ల‌పై దండెత్తిన బందిపోట్ల క‌థ ఇది. మ‌రి చూడాలి.. రేపు విడుద‌లైన త‌ర్వాత అమీర్ ఖాన్ బాహుబ‌లిని బీట్ చేస్తాడో లేదో..? న‌వంబ‌ర్ 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here