2.0 ఆకాశంలో తెలుగు బిజినెస్.. 80 కోట్లు వ‌స్తాయా..?

ర‌జినీకాంత్ ను తెలుగు హీరో కాదు.. త‌మిళ హీరో అంటే ఇక్క‌డ కొడ‌తారేమో..? ఎందుకంటే ర‌జినీ యూనివ‌ర్స‌ల్ సూప‌ర్ స్టార్. ఇండియా మొత్తం ఈయ‌నకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ర‌జినీ సినిమా అంటే అన్ని ఇండ‌స్ట్రీలు ఆస‌క్తిగా చూస్తుంటాయి. ఇప్పుడు 2.0 కూడా దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఈ సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు తిర‌గ‌రాస్తుంది. ఏ నిర్మాత‌కైనా 540 కోట్ల‌తో సినిమా నిర్మించిన‌పుడు టెన్ష‌న్ ఉంటుంది. కానీ 2.0 విష‌యంలో మాత్రం అదేం లేదు. ఎందుకంటే అక్క‌డున్న‌ది ర‌జినీకాంత్ క‌దా. ఎన్ని కోట్లు పెట్టినా ముందే బిజినెస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది.

2point0
2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. త‌మిళ్ లో ఆకాశాన్ని తాకేస్తున్న రేట్లు.. తెలుగులోనూ అలాగే ఉంది. ఎన్వీఆర్ సినిమాస్ 2.0 హ‌క్కుల్ని భారీ రేట్ కు సొంతం చేసుకున్నారు. అక్క‌డ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిపి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ఎన్వీఆర్ సినిమాస్. తెలుగులో కూడా దాదాపు 80 కోట్ల‌కు పైగానే 2.0 బిజినెస్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది. ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఇదే హైయ్య‌స్ట్ రేట్. సినిమాపై ఉన్న హైప్ తో పోలిస్తే ఇది త‌క్కువే అంటున్నారు విశ్లేష‌కులు. చూడాలిక‌.. 2.0తో ర‌జినీ ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తాడో..? ఆ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *