ఇన్ని ముద్దులు కెరీర్ ను గాడిన పెడ‌తాయా..?

ముద్దుల ప్రియుడు అంటే తెలుగులో వెంక‌టేష్ పేరు గుర్తొస్తుంది. ఆయ‌నే అప్ప‌ట్లో ముద్దుల ప్రియుడు అనిపించాడు. ఇప్పుడు ఒరిజిన‌ల్ గా అయితే ఆ బిరుదు విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌రికి వెళ్తుంది. ఎందుకంటే ఆయ‌న ప్ర‌తీ సినిమాలోనూ ముద్దుల‌తో ముంచెత్తుతున్నాడు కాబ‌ట్టి. ఇక ఇప్పుడు హెబ్బాప‌టేల్ ముద్దుల ప్రియురాలు అయిపోయింది. దానికి కార‌ణం 24 కిస్సెస్. అక్ష‌రాలా 24 ముద్దులు అని అర్థం. ఇందులో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ కుమారి. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత హెబ్బాకు స‌రైన స‌క్సెస్ రాలేదు.

24 KISSES HEBAH PATEL

దాంతో హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ భామ‌. దానికితోడు అమ్మాయి ఫుల్ గా బ‌రువు పెరిగిపోయి చూడ‌లేని విధంగా మారిపోయింది. ఇలాంటి టైమ్ లో 24 కిస్సెస్ అంటూ వ‌స్తుంది ఈ భామ‌. ఈ సినిమాలో కుమారిని మించి గ్లామ‌ర్ పంచ‌డానికి వ‌స్తుంది హెబ్బా. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ 24 కిసెస్ అనే సినిమాలో న‌టిస్తుంది.
ఇప్ప‌టికే ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

అనుకున్న‌ట్లుగానే ఏ స‌ర్టిఫికేట్ అందుకుంది. న‌వంబ‌ర్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్ర రిలీజ్ ట్రైల‌ర్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ట్రైల‌ర్ నిండా ముద్దులే క‌నిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమాలో ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి మొద‌లైపోయింది. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రంలో 24 ముద్దు సీన్లు ఉంటాయి. ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ రొమాన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్. ట్రైల‌ర్ లోనే ముద్దుల వ‌ర్షం కురిపించింది హెబ్బా. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం గురించి హెబ్బా చెబుతూ.. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ లోనూ త‌న‌ది బోల్డ్ కారెక్ట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ స్పైసీ కారెక్ట‌ర్ అయినా హెబ్బాను ఒడ్డున ప‌డేస్తుందో లేదో చూడాలిక‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here