2.0 టీజ‌ర్ ఆ రోజంట‌.. న‌మ్మొచ్చా..?

ర‌జినీకాంత్ సినిమా అంటేనే చెప్పిన టైమ్ కు వ‌స్తుందా రాదా అనే టెన్ష‌న్. ఇక ఆయ‌న‌కు తోడుగా శంక‌ర్ కూడా ఉన్నాడు. అంటే క‌చ్చితంగా చెప్పిన టైమ్ కు రాద‌ని క‌న్ఫ‌ర్మేష‌న్ అన్న‌మాట‌. ఇప్ప‌టికే విడుద‌ల తేదీ విష‌యంలో చాలా సార్లు డేట్లు మార్చారు. ఇలాంటి వాళ్ల‌కు టీజ‌ర్ రిలీజ్ డేట్ ఓ లెక్క‌. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది.

2.0 TEASER RELEASE DATE LOCKED

ఈ చిత్ర టీజ‌ర్ ఎవ‌రూ అడ‌క్క‌ముందే అప్ప‌ట్లో ఎప్రిల్ 14 అని అనౌన్స్ చేసారు. కానీ వ‌స్తుంద‌ని ఆశించి ఆనందించినంత సేపు ప‌ట్ట‌లేదు హ్యాండివ్వ‌డానికి. కొట్టి మ‌రీ ఆయింట్ మెంట్ రాయ‌డం అంటే ఇదే. ఎప్రిల్ త‌ర్వాత మ‌ళ్లీ నాలుగు నెల‌లు గ‌డిచి పోయాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు టీజ‌ర్ అయితే రాలేదు. కొన్ని టెక్నిక‌ల్ కార‌ణాల‌తో టీజ‌ర్ విడుద‌ల సాధ్యం కావ‌ట్లేద‌ని సారీ చెప్పారు యూనిట్. ఇక ఇప్పుడు మ‌రో తేదీ అనౌన్స్ చేసారు. ఈ సారి సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల అవుతుంద‌ని చెబుతున్నారు యూనిట్.

వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈ టీజ‌ర్ విడుద‌ల అవుతుంద‌ని చెప్పారు చిత్ర యూనిట్. సినిమా సంగ‌తి త‌ర్వాత ముందు టీజ‌ర్ అయినా వ‌స్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ దాన్ని కూడా వాయిదా వేస్తూనే ఉన్నాడు శంక‌ర్. విజువల్‌ ఎఫెక్ట్స్ కార‌ణంగానే వాయిదా పడిందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్ర విజువ‌ల్ ఎఫెక్ట్స్ టీం మేనేజ‌ర్ శ్రీనివాస్‌ మోహన్‌ పర్యవేక్షణలో ప్ర‌పంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం పని చేస్తున్నాయి.

బాహుబ‌లి తొలి భాగానికి ప‌నిచేసింది ఈయ‌నే. ఇక ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.0 రికార్డు సృష్టించబోతోంది. 450 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here