హ‌రికృష్ణ మృతికి మోహ‌న్ బాబు సంతాపం..

నంద‌మూరి కుటుంబంతో మంచు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అన్నీ అన్న‌గారే అంటూ ఎప్పుడూ చెబుతుంటాడు మోహ‌న్ బాబు. ఇలాంటి క‌లెక్ష‌న్ కింగ్ కు ఈ రోజు మ‌న‌సు బ‌రువెక్కిపోయే క‌ష్టం వ‌చ్చింది. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం ఈయ‌న్ని చాలా కృంగ‌దీసింది. అయితే చివ‌రిచూపుకు కూడా నోచుకోలేని ప‌రిస్థితుల్లో మోహ‌న్ బాబు ఉన్నారిప్పుడు. అందుకే ట్విట్ట‌ర్ లో త‌న సంతాపాన్ని తెలియ‌జేసారు క‌లెక్ష‌న్ కింగ్.

Mohan babu Condolence to Nandamuri Family,mohan babu, hari krishna,
నేను ఇండియాలో లేను అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ రోజు మొదలైన మా అనుబంధం ఈ నాటికి కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అంటూ లేఖ ట్వీట్ చేసారు మోహ‌న్ బాబు. వ‌చ్చిన వెంట‌నే నంద‌మూరి కుటుంబాన్ని క‌లిసి త‌న సానుభూతిని తెలియ‌జేయ‌నున్నారు ఈ సీనియ‌ర్ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here