హ్యాపీ బర్త్ డే పవన్.. తమ్ముడికి ప్రేమతో..!

మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ప్రేమ‌లు మ‌రోసారి బ‌య‌టికి వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు చిరు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ బాబాయ్ కు ఆప్యాయంగా బ‌హుమ‌తి ఇచ్చాడు. గాల్లో ఎగిరి మ‌రి బాబాయ్ కు విషెస్ చెప్పాడు. ఇప్పుడు చిరంజీవి కూడా త‌మ్ముడికి ప్రేమ‌గా శుభాకాంక్ష‌లు చెప్పాడు.

అయితే ఈయ‌న మాత్రం అంద‌రికీ తెలిసేలా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసాడు. త‌న త‌మ్ముడికి దేవుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకున్నాడు. ఇక ప‌వ‌న్ కు కూడా ఎంత‌మంది విషెస్ చెప్పినా అన్న‌య్య ఆశీర్వాదం ప్ర‌త్యేకం. క‌ళ్యాణ్ బాబు.. నువ్వు అందుబాటులో లేవ‌ని తెలిసింది.. క‌ల‌వాల‌ని అనుకుని విర‌మించాను.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. నీకు ఆ హ‌నుమాన్ ఆశీస్సులు ఉండాల‌ని.. మాన‌సిక స్థైర్యాన్ని.. ధైర్యాన్ని.. ఆరోగ్యాన్ని మ‌న‌శ్శాంతిని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను.. ఆశీస్సుల‌తో అన్న‌య్య చిరంజీవి అంటూ ట్వీట్ చేసాడు మెగాస్టార్.

ఈ విషెస్ ను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. గ‌తేడాది కూడా ప‌వ‌న్ త‌న పుట్టినరోజు నాడు అంద‌రికంటే ముందు అన్న‌య్య ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని వ‌చ్చాడు. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా విషెస్ అందుకోక‌పోయినా కూడా త‌మ్ముడికి ప్రేమ‌గా ఆశీర్వాదాలు అయితే అందించాడు మెగాస్టార్. ఈ బంధాలు చూసి ఫ్యాన్స్ కూడా పండ‌గ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here