స‌ర్కార్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా.. ?

విజ‌య్ సినిమాల‌కు ఇప్పుడు త‌మిళ‌నాడుతో పాటు తెలుగులో కూడా క్రేజ్ మొద‌లైంది. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆయ‌న సినిమాల‌కు ఇక్క‌డ కూడా మంచి టాక్ వ‌స్తున్నాయి.. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా నిలబ‌డ‌టం లేదు అంతే. గ‌తేడాది అదిరిందితో అది కూడా జ‌రిగింది. ఈ చిత్రం ఇక్క‌డ కూడా హిట్టైంది.

SARKAR

ఇక ఇప్పుడు ఇదే న‌మ్మ‌కంతో మురుగ‌దాస్ తో చేస్తోన్న స‌ర్కార్ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. తుపాకి.. క‌త్తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత విజ‌య్ తో మురుగ‌దాస్ చేస్తోన్న సినిమా ఇది. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు మురుగ‌దాస్ కెరీర్ కూడా స‌ర్కార్ పైనే ఆధార‌ప‌డి ఉంది.

పైగా క‌త్తి.. తుపాకికి ముందు కూడా మురుగ‌దాస్ కు ఫ్లాపులు ఉన్నాయి. విజ‌య్ సినిమాతోనే మ‌ళ్లీ హిట్ కొట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. స్పైడ‌ర్ తో పాటు దానికి ముందు అకీరా కూడా ఫ్లాపే. దాంతో ఈ రెండు ఫ్లాపుల్ని మ‌రిపించ‌డానికి ఇప్పుడు మురుగ‌దాస్ స‌ర్కార్ తో వ‌స్తున్నాడు. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ తో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఇందులో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి విల‌న్.. మ‌రోటి హీరో. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. సినిమా ద‌స‌రాకు విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా మురుగ‌దాస్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here