స‌మంత భ‌లే మేనేజ్ చేస్తుందిగా..

పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌డుతుందంటారు. కానీ స‌మంత‌కు మాత్రం పెళ్లి త‌ర్వాతే సుడి ఇంకా క‌లిసొస్తుంది. అస‌లు ఈమె పెళ్ళైన త‌ర్వాత ఎన్ని సినిమాలు చేసింది.. ఎన్ని విజ‌యాలు సాధించింది అని లెక్కేస్తే.. 100 శాతం స‌క్సెస్ రేట్ తో దూసుకెళ్లిపోతుంది. తెలుగులో రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. అభిమ‌న్యుడుతో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది.

samantha

ఈ సినిమాల త‌ర్వాత స‌మంత‌కు ఇంకా డిమాండ్ పెరిగింది. ఇప్ప‌టికీ స్టార్ హీరోలు త‌మ సినిమాల్లో న‌టించాలంటూ ఈ భామ‌ను కోరుతున్నారు. అయితే ఇప్పుడు స‌మంత మాత్రం ఎక్కువగా ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌పైనే దృష్టి పెడుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో సూప‌ర్ డీల‌క్స్ షూటింగ్ పూర్తి చేసింది స్యామ్. దాంతో పాటు తెలుగులో యు ట‌ర్న్ సినిమా కూడా పూర్తి చేసింది.
రెండు సినిమాల‌తో పాటు శివ‌కార్తికేయన్ సీమ‌రాజా సినిమాను సైతం పూర్తి చేసింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే యు ట‌ర్న్ తో పాటు సీమ‌రాజా కూడా సెప్టెంబ‌ర్ 13నే విడుద‌ల కానున్నాయి.

అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావ‌డం వ‌ల్ల యు ట‌ర్న్ కు న‌ష్ట‌మే. అందుకే చివరి నిమిషం వ‌ర‌కు ఏం జ‌రిగేది తెలియ‌దు. ఇక తెలుగులో భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిటైంది. ఇలా హైద‌రాబాద్ టూ చెన్నై చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది స‌మంత‌. అటు ఇటు షిఫ్టింగులు చేస్తున్నా కూడా ఇప్ప‌టికీ చాలా మంది ద‌ర్శ‌కులు.. హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ గా మారిపోయింది స‌మంత‌. దాంతో పెళ్లైనా కూడా నువ్వే కావాలంటూ అంతా వెంట ప‌డుతున్నారు. మ‌రి ఈ మాయ‌లేడి హ‌వా ఇంకెన్నాళ్లుంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here