స‌మంత న‌మ్మ‌క‌మే గెలిచింది.. యు ట‌ర్న్ అదుర్స్..

స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ త‌లుచుకోవాలే కానీ ఏ సినిమా అయినా కూడా ముందు వ‌చ్చి నిల‌బ‌డుతుంది. ఇక చిన్న సినిమా ప‌రిస్థితి అయితే అస‌లు చెప్పాల్సిన ప‌నిలేదు. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్.. ఓ సినిమా కోసం.. ఓ చిన్న ద‌ర్శ‌కుడి కోసం రెండేళ్లు వేచి చూసింది. ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆ క‌థ‌పై మ‌న‌సు పారేసుకుంది. అంతా ఎందుకు అబ్బా ఇంత ఆస‌క్తి అనుకున్నారు కానీ ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత చూస్తుంటే స‌మంత న‌మ్మ‌కమే నిజ‌మైంది.

SAMANTHA U TURN

యు ట‌ర్న్ సినిమాకు వ‌చ్చిన టాక్.. వ‌స్తున్న రివ్యూస్.. స‌మంత న‌ట‌న‌కు వ‌స్తున్న అప్లాజ్ చూస్తుంటే ఈమె స్టోరీ జ‌డ్జిమెంట్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ రీమేక్ లో న‌టించింది ఈ భామ‌. ఇప్పుడు తెలుగు, త‌మిళ‌నాట కూడా ఈ సినిమాకు టాక్ బాగా వ‌చ్చింది.

రోడ్ సైడ్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రంలో సందేశం కూడా ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్. తెలిసీ తెలియ‌క చేస్తున్న చిన్న చిన్న త‌ప్పులు నిండు కుటుంబాల‌ను ఎలా చిధిమేస్తున్నాయి అనే సున్నిత‌మైన క‌థ‌ను మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా ప‌క్కా స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్. దీనికి స్యామ్ న‌ట‌న‌తో పాటు ఆది కూడా అద‌ర‌గొట్ట‌డంతో ఇప్పుడు యు ట‌ర్న్ థియేట‌ర్స్ లో కుమ్మేస్తుంది. ఈ సినిమా కోసం ఒప్పుకున్న సినిమాలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసింది స‌మంత‌. 2016లో క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా విజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. మొత్తానికి ఇన్నాళ్లూ ఈ సినిమాపై స‌మంత చూపించిన న‌మ్మ‌క‌మే గెలిచింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here