సోనాలిని చంపేసాడు.. తాను ఇరుక్కున్నాడు..

ఒక్క చిన్న ట్వీట్.. ఒకేఒక్క చిన్న ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్ర‌బుద్ధుడు. బ‌తికున్న మ‌నిషిని చంపేసి అడ్డంగా ఇరుక్కున్నాడు. మ‌ళ్లీ అలా చేసిన వాడు చిన్న వాడేం కాదు.. ఎమ్మెల్యే. బిజేపీ మ‌హారాష్ట్ర ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ చేసిన ప‌నికి ఇప్పుడు ఆ పార్టీ కూడా సిగ్గు ప‌డుతుంది. స‌మాధానం చెప్పుకోలేక చ‌చ్చిపోతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈయ‌న సోనాలి బింద్రేను బ‌తికుండ‌గానే చంపేసాడు. ప్ర‌స్తుతం ఈమె న్యూయార్క్ లో కేన్స‌ర్ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. అయితే అక్క‌డ చికిత్స జ‌రుగుతుండ‌గానే సోనాలి చ‌నిపోయింద‌ని ట్వీట్ చేసాడు రామ్. ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్నా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిపోయింది.

SONALI BENDRE RAM KADAM

హిందీ, తెలుగు, మ‌రాఠీ భాష‌ల్లో ఎన్నో సినిమాల్లో న‌టించి.. త‌న‌దైన ముద్ర వేసుకున్న సొనాలి బింద్రే ఇక‌లేరు.. ఆమె క్యాన్స‌ర్‌తో బాధపడుతూ అమెరికాలో క‌న్నుమూసారు అంటూ సంచ‌ల‌న ట్వీట్ చేసాడు రామ్. ఇది చూసి సోనాలి ఫ్యాన్స్ కూడా కంగారు ప‌డ్డారు. ఆ త‌ర్వాత అస‌లు నిజం తెలుసుకుని నాలుక కరుచుకున్నారు రామ్ క‌ద‌మ్. క‌నీసం నిజ‌మేంతో తెలియ‌కుండా ఇలా చేయ‌డం ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ స్థాయి దిగ‌జార్చుకోవ‌డ‌మే అంటూ ఫుల్లుగా ఈయ‌న్ని ఎక్కేస్తున్నారు నెటిజ‌న్లు. ఓ సెలెబ్రెటీ ఆరోగ్యంతో క‌నీసం బాధ్య‌త లేకుండా మ‌రో సెలెబ్రెటీ ఇలా ట్వీటేయ‌డంతో ఇప్పుడు ఆయ‌నై గుర్రుగా ఉన్నారు అభిమానులు. ఈయ‌న ఈ మ‌ధ్యే కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా న‌చ్చిన అమ్మాయి ఉంటే కిడ్నాప్ చేయండంటూ హిత‌వు ప‌లికి చివాట్లు తిన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు సోనాలి విష‌యంలోనూ తొంద‌ర‌ప‌డి తిట్లు ఫుల్లుగా తినేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here