సైరా టీజ‌ర్.. విజిల్ కొట్టు బాసూ..!

దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. స్వ‌తంత్ర్యానికి పూర్వం వాళ్లు చేసిన త్యాగాల‌తోనే ఇప్పుడు భార‌తావ‌ని ఇంత అద్భుతంగా ఉంది. అయితే ఎంత‌మంది ప్రాణాలు వ‌దిలినా కూడా భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు మాత్రం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న పేరు చాలా మందికి తెలియ‌దు.

syeraa-teaser

అందుకే ఇప్పుడు మ‌న తెలుగు వీరుడి క‌థ‌ను దేశానికి చాటి చెప్పాల‌ని చిరంజీవి ముందుకొచ్చాడు. సైరా టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఇది ఏం రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. టీజ‌ర్ అంతా అద్భుతం అనే మాటే. ముఖ్యంగా విజువ‌ల్స్ అయితే నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. బాహుబ‌లి ఎలా అయితే విజువ‌ల్ వండ‌ర్ గా పేరు తెచ్చుకుందో ఇప్పుడు సైరా కూడా అంతే. సురేంద‌ర్ రెడ్డి కూడా మేకింగ్ లో త‌న స్టైల్ చూపించాడు.

టీజ‌ర్ లో కేవ‌లం చిరంజీవిని మాత్రమే చూపించారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 79 సెక‌న్ల పాటు అన్న‌య్య‌ను అద్భుతంగా చూపించి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఫైట్ సీన్స్ కంపోజ్ చేసారు. ఇక ఇప్పుడు లీ విక్ట‌ర్ ఈ చిత్రం కోసం వ‌స్తున్నాడు. హాలీవుడ్ లో ఈయ‌న స్టార్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్. ఫారెన్ షెడ్యూల్ లో మొత్తం ఈయ‌నే ఫైట్స్ కంపోజ్ చేయ‌బోతున్నాడు.

మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ గ‌త షెడ్యూల్లోనే ఇక ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ ను కూడా మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. అందులో మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here