సెగ‌లు పుట్టించిన యామినీ భాస్క‌ర్..

యామిని భాస్క‌ర్.. ఈ పేరుతో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా త‌క్కువ మందికి ప‌రిచ‌యం ఉండుడొచ్చు. కానీ మ‌రో నెల రోజుల్లో ఈ పేరుకు బాగానే క్రేజ్ రావ‌డం మాత్రం ఖాయం. దానికి కార‌ణం న‌ర్త‌న‌శాల‌.

ఈ సినిమాలో నాగ‌శౌర్య‌కు జోడీగా న‌టిస్తుంది ఈ బ్యూటీ. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న సినిమాల‌తో కాలం గ‌డిపిన యామిని.. తొలిసారి క్రేజీ ప్రాజెక్ట్ లో న‌టిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మరాయుడులో త‌మ్ముళ్ల‌లో ఒక‌రికి జోడీగా న‌టించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు హీరోయిన్ గా అదృష్టం ప‌రీక్షించుకుంటుంది. పైగా ఇప్పుడు విడుద‌లైన పిచ్చిపిచ్చిగా పాట‌లో బికినీ కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ‌. యామిని సొగ‌సుల‌తోనే ఎవ‌రీ భామ అంటూ ఇప్ప‌టికీ ఆరా కూడా మొద‌లు పెట్టేసారు నిర్మాత‌లు. ఇన్నాళ్లుగా ఇండ‌స్ట్రీ ఉన్నా.. ఈ భామలో ఈ యాంగిల్ చూడ‌లేదే అంటూ నాలుక క‌రుచుకుంటున్నారు. ఆగ‌స్ట్ 30న న‌ర్త‌న‌శాల విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా ఈ భామ పేరు కాస్తో కూస్తో మాట్లాడుకోవ‌డం అయితే ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here