సునీల్ వ‌చ్చేసాడు.. ఇదిగో సాక్ష్యం..!

రావాలంటే ముందు పోవాలి క‌దా.. సునీల్ ఎక్క‌డికి వెళ్లాడు.. ఇక్క‌డే క‌దా ఉన్నాడు అనుకుంటున్నారా..? అవును ఇక్క‌డే ఉన్నాడు కానీ హీరోగా. అయితే ఇప్పుడు క‌మెడియ‌న్ గా వ‌చ్చేసాడు. వ‌చ్చి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు సాక్ష్యం కూడా వ‌చ్చింది. ఈయ‌న న‌టిస్తున్న అర‌వింద స‌మేత టీజ‌ర్ విడుద‌లైంది.

SUNIL RE ENTRY ARAVINDA TEASER

ఇందులో ఎన్టీఆర్ ప‌క్క‌న క‌నిపించాడు సునీల్. ఎప్ప‌ట్లాగే మ‌ళ్లీ భ‌య‌ప‌డుతూ అదే పాత సునీల్ ను చూపిస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ఈ స‌రికొత్త సునీల్ ను చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న సినిమాల‌న్నీ ఇప్పుడు వేగంగా షూట్ జ‌రుపుకుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో బిజీగా ఉన్నాడు.

మ‌రోవైపు అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టిస్తున్న సిల్లీఫెల్లోస్ లో కూడా సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్.

ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టిస్తున్నాడు. దాంతోపాటు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. అల్ల‌రిన‌రేష్ సిల్లీఫెల్లోస్ లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు సునీల్. సాయిధ‌రంతేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా న‌టిస్తున్నాడు. మ‌రి వీటితో మ‌నోడి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here