సిల్లీఫెలోస్ ట్రైల‌ర్.. సుడిగాడు 2..!

అల్ల‌రి న‌రేష్ సినిమా అంటే ముందు ఊహించేది కామెడీ. కొన్నేళ్లుగా ప్రేక్ష‌కుల‌కు అదే దొర‌క‌డం లేదు. అందుకే న‌రేష్ సినిమాల వైపు క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. ఇలాంటి టైమ్ లో సుడిగాడు ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస్ తో క‌లిసి ఈయ‌న సిల్లీఫెలోస్ చేస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు.

SILLY FELLOWS TRAILER LAUNCH

ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా న‌రేష్ ఈ సారి ఏదో మాయ చేసేలా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో కామెడీ బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ముఖ్యంగా ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సుడిగాడు 2 అంటున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు టీం.తొట్టిగ్యాంగ్ త‌ర్వాత సునీల్, అల్ల‌రి న‌రేష్ మెయిన్ లీడ్ చేస్తోన్న సినిమా ఇదే.

మ‌రోవైపు ఇప్పుడు ఇద్ద‌రి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. న‌రేష్ ప‌రిస్థితి అయితే మ‌రీనూ..! ఏ టైమ్ లో సుడిగాడు చేసాడో కానీ అప్ప‌ట్నుంచి న‌రేష్ కెరీర్ లో సుడి లేకుండా పోయింది. ఆ సినిమా వ‌ర‌కే సుడి ప‌నిచేసింది. ఆ త‌ర్వాత అన్నీ ఫ్లాపులే కానీ ఒక్క హిట్ కూడా లేదు. ఐదేళ్లైంది ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా హిట్ కాలేదు. 2012లో వ‌చ్చిన సుడిగాడు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం లేదు ఈ కుర్ర హీరోకు.

మ‌రో రాజేంద్ర ప్ర‌సాద్ అవుతాడ‌నుకుంటే.. ఎటు వెళ్తుందో తెలియ‌ని గ‌మ్యం వైపు న‌రేష్ కెరీర్ వెళ్తుందిప్పుడు. ఈయ‌న కెరీర్ తీరం తెలియ‌ని నావ‌లా.. చుక్కాని లేని ప‌డ‌వ‌లా మారిపోయిందిప్పుడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న కెరీర్ ఎక్క‌డైతే ఆగిపోయిందో.. అక్క‌డే మ‌ళ్లీ మొద‌లు పెడుతున్నాడు అల్ల‌రోడు. సిల్లీఫెలోస్ పైనే అల్ల‌రోడి ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇక అల్ల‌రి న‌రేష్ ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ మారిపోయాడు. మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షిలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అందుకే ఇప్పుడు సిల్లీఫెలోస్ ట్రైల‌ర్ కూడా మ‌హేశ్ విడుద‌ల చేసాడు. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here