సంప‌త్ నందికి చుక్క‌లే.. ఏం చేస్తాడో మ‌రి..?

వ‌ర‌స‌గా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు సంప‌త్ నంది. ఏం మాయ చేసాడో తెలియ‌దు కానీ ఏమైంది ఈవెళ‌.. ర‌చ్చ‌.. బెంగాల్ టైగ‌ర్ సినిమాలు ప‌ర్లేద‌నిపించాయి. క‌మ‌ర్షియ‌ల్ గానూ నిర్మాత‌ల‌ను సేఫ్ చేసాయి. దాంతో ఈ ద‌ర్శ‌కుడితో సినిమాకు హీరోలు కూడా ఆస‌క్తి చూపించారు. అయితే బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత మ‌నోడి జాత‌కం పూర్తిగా తిర‌గ‌బ‌డిపోయింది. గోపీచంద్ తో తెర‌కెక్కించిన గౌత‌మ్ నందా ఫ్లాప్ కావ‌డం.. మ‌ధ్య‌లో నిర్మాత‌గా చేసిన గాలిప‌టం చిరిగి పోవ‌డంతో ఈయ‌న క‌నిపించ‌డం కూడా మానేసాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి అన్నీ తానేయై పేప‌ర్ బాయ్ అంటూ వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.

SAMPATH NANDI

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌ల‌తో పాటు ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ కూడా చేసాడు. ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కమే పెట్టుకున్నాడు సంప‌త్. క‌చ్చితంగా ఇది త‌న కెరీర్ కు బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్మాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం కూడా తుస్ అనిపిస్తుంది. క‌విత్వం మ‌రీ పెరిగిపోయి.. క‌థ త‌క్కువైపోయింది సినిమాలో అంటున్నారు ప్రేక్ష‌కులు. దానికి తోడు కొత్త హీరో కావ‌డం.. మ‌రోవైపు గీత‌గోవిందం ఇప్ప‌టికీ దుమ్ము దులిపేస్తుండ‌టంతో పేప‌ర్ బాయ్ నిల‌బ‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దాంతో ఇప్పుడు సంప‌త్ నంది ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు. మెగా కుటుంబ హీరోల‌తో నెక్ట్స్ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ని అక్క‌డి హీరోలు న‌మ్ముతారా అనేది అస‌లు స‌మ‌స్య‌. మ‌రి చూడాలిక‌.. ఈ స‌మ‌యంలో ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఏం చేస్తాడో.. చేయాల‌నుకుంటున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here