షేక్ షేక్ అంటున్న రాజ్ త‌రుణ్..

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రుణించ‌న‌ట్లుంది ఇప్పుడు రాజ్ త‌రుణ్. ఎందుకంటే వ‌ర‌స డిజాస్ట‌ర్స్ తో ఈయ‌న కెరీర్ ముందుకెళ్ల‌డం కూడా క‌ష్టం అయిపోయింది ఇప్పుడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన రాజుగాడు.. రంగుల‌రాట్నం పూర్తిగా ఈయ‌న కెరీర్ డౌన్ ఫాల్ లోకి తీసుకెళ్లాయి. అయితే ఎన్ని ఫ్లాప్స్ వ‌చ్చినా కూడా ల‌వ‌ర్ త‌న‌కు ఉన్నాడ‌ని ధైర్యంగా ఉన్నాడు ఈ హీరో. పైగా దిల్ రాజు బ్యాన‌ర్ కావ‌డంతో ఎలాంటి అనుమానాలు లేకుండా ఉన్నాడు ఈ కుర్ర హీరో.

RAJ TARUN MOVIE

అయితే ఇది కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో క‌నిపించ‌డ‌మే మానేసాడు ఈయ‌న‌. ఇన్ని రోజులు క‌నీసం ఈయ‌న ఎక్క‌డున్నాడో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడ‌ని కూడా ఎవ‌రూ ఊహించ‌డం లేదు. సినిమాలు మానేసి ద‌ర్శ‌క‌త్వం వైపు వెళ్తాడ‌నే టాక్ కూడా వ‌చ్చింది. అయితే ఇప్ప‌టికీ మ‌రో అవ‌కాశం వేచి చూస్తుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ లో బాబు బాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఈ చిత్రం త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. అస‌లు ఇలాంటి టైమ్ లో అభిషేక్ నామా నుంచి అవ‌కాశం రావ‌డమే రాజ్ త‌రుణ్ కు సుడిగాడు అని అర్థ‌మైపోతుంది. అయితే ఈ చిత్రం ఆయ‌న జాత‌కాన్ని మార్చేస్తుందేమో అనుకోవ‌డం అత్యాశే. మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింది అంతే. మ‌రి దాంతో రాజ్ ఎలాంటి మాయ చేస్తాడ‌నేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here