శౌర్య‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించిందిగా..!

చ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సొంత నిర్మాణ సంస్థ‌లో సినిమా అంటే క‌చ్చితంగా మ‌ళ్లీ అదే స్థాయిలో ఊహిస్తారు ప్రేక్ష‌కులు. కానీ అందులో స‌గం కాదు క‌దా.. పావువంతు కూడా లేకుండా న‌ర్త‌న‌శాల చేసాడు ఈ హీరో. పైగా లెజెండ‌రీ టైటిల్ ను కూడా నాశ‌నం చేసాడంటూ ఈయ‌నపై నంద‌మూరి ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.

NAGA SHAURYA DISASTER

అస‌లు ఇంత‌గా ఎలా మోస‌పోయాడబ్బా అంటూ శౌర్య‌పై జాలి చూపిస్తున్న వాళ్లు కూడా లేక‌పోలేదు. ఓ విజ‌యం రాగానే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో తానేం చేసినా కూడా చూస్తారులే అనేది వ‌చ్చేసిందా.. లేదంటే నిజంగానే క‌థ అంత బాగా న‌చ్చినా ద‌ర్శ‌కుడు దాన్ని ఏ కోశానా కూడా స‌రిగ్గా తీయ‌లేక‌పోయాడా..?

ఈ విష‌యంపై ఇప్ప‌టికే అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది శౌర్య‌లో. ఎందుకంటే ఈ సినిమా కానీ హిట్టై ఉంటే ఇప్పుడు మ‌నోడి మార్కెట్ 15 కోట్ల వ‌ర‌కు పెరిగేది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ అదే 5 కోట్ల‌కు ప‌డిపోయింది. ఇప్పుడు న‌ర్త‌న‌శాల క‌నీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోక‌పోవ‌డంతో నాగ‌శౌర్య కెరీర్ మ‌ళ్లీ గాడి త‌ప్పింది. దాంతో ఇప్పుడు రాజా కొలస సినిమాపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. ఇది కానీ తేడా కొడితే మ‌నోడి మార్కెట్ మ‌రింత డౌన్ కావ‌డం ఖాయం. అన్న‌ట్లు త‌న నిర్మాణంలోనే ర‌మ‌ణ‌తేజ అనే కొత్త ద‌ర్శ‌కుడితోనూ ఓ చిత్రం చేయ‌బోతున్నాడు శౌర్య‌. మ‌రి వీటిలో ఏది మ‌నోడి జాత‌కాన్ని మార్చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here