శైల‌జరెడ్డి అల్లుడు ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది..

ఆగ‌స్ట్ 29నే రావాల్సిన శైల‌జరెడ్డి అల్లుడు ట్రైల‌ర్ హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అనుకోకుండా ఆగిపోయింది. ఇది ఇప్పుడు విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ 31న ఈ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పెద్ద‌గా హ‌డావిడి ఏం చేయ‌కుండానే ఈ ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నారు.

SAILAJA REDDY ALLUDU

దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో టైమ్ బాగోలేదు. హ‌రికృష్ణ మ‌ర‌ణం మ‌రిచిపోక‌ముందే ద‌ర్శ‌కురాలు బి జ‌య కూడా క‌న్ను మూయ‌డంతో అంతా షాక్ లో ఉన్నారు. అస‌లు ఇది కలా నిజ‌మా అని గిల్లి చూసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో వేడుక‌గా ట్రైల‌ర్ చేసుకోవ‌డం మంచిది కాద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకే సింపుల్ గా యూ ట్యూబ్ లో విడుదల చేయ‌బోతున్నారు. నాగ‌చైత‌న్య‌, అను ఎమ్మాన్యువ‌ల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించింది. మారుతి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. చైతూ కోరుకున్న విజ‌యం అల్లుడు తీసుకొస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here