వున్నది ఒకటే జిందగీ రివ్యూ

తారాగణం: రామ్, శ్రీ విష్ణు, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

దర్శకత్వం: కిశోరె తిరుమల

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత: కృష్ణ చైతన్య

బ్యానర్: స్రవంతి

కథ:

అభి (రామ్) & వాసు (శ్రీ విష్ణు) చిన్నపాటి నుండి మంచి స్నేహితులు. అభి గాయకుడూ కాగా వాసు పై చదువులకు ఢిల్లీ వెళ్తాడు. ఈ లోపు అభి మహా(అనుపమ) ప్రేమలో పడతాడు. మహా వాసుకి బంధువవుతుందని, వారిద్దరికీ పెళ్లి చెయ్యాలని వారి కుటుంబాలు అనుకుంటున్నట్లు తెలిసి అభి అవాక్కవుతాడు. మహా కోసం అభి వాసులు గొడవపడతారా? స్నేహితుడి కోసం తన ప్రేమను అభి త్యాగం చేస్తాడా? ఈ ఆసక్తికర ప్రశ్నలకు జవాబు కావాలంటే తప్పక వున్నది ఒకటే జిందగీ చిత్రాన్ని చూడాల్సిందే.

స్క్రీన్ప్లే:

స్వచ్ఛమైన స్నేహం కుడిన త్రికోణపు ప్రేమ కథ ఇతివృత్తం ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కించాడుకిశోరె తిరుమల. ప్రథమార్ధం చిన్నతనం నుండి వారి స్నేహం ఎలా చిగురించింది, వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఎరపడటం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టి సారించడం తో కొంత నెమ్మది గా సాగినట్లనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎమోషనల్ గా కథ వేగం అందుకుంటుంది. ఫ్రెండ్స్ మధ్య కొంత హాస్యం పండుతుంది. కొన్ని మంచి డైలాగులు కూడిన బరువైన సన్నివేశాలు రక్తికట్టించారు దర్శకుడు. అయితే మళ్ళి లవ్ ట్రైయాంగిల్ వాతావరణం ద్వితీయార్ధంలో కూడా ఉంటుంది. ఓవర్ సెంటిమెంట్ మేలో డ్రామా కొంత ఇబ్బందికరం గా ఉంటుంది.

రివ్యూ

ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలుగా ఇదివరకు వచ్చిన ప్రేమ దేశం, హ్యాపీ డేస్ వంటి చిత్రాలు ఉన్నా అవి మంచి సంగీతం ఉండటం తో సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ కథలో ప్రధాన వీక్నెస్ అదే. చిత్రం సాగతీసినట్లుంది వచ్చిన సీన్లే మళ్ళి వచ్చి విసుగు తెప్పిస్తాయి.
అయితే రామ్ , శ్రీ విష్ణుల చక్కటి నటన ఈ చిత్రానికి ఊరట. అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. లావణ్య త్రిపాఠి కామెడీ ఉన్నా పాత్రలో బాగానే చేసింది. ప్రియదర్శి నవ్వులు పూయిస్తాడు.

దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలు అంతగా అనిపించవు. హీరో గాయకుడైన అతని పాటలన్ని ఒకే స్వరం తో వినపడి బాణీలు బాగున్నా మ్యాజిక్ మిస్ అయినట్లుంటుంది. ఛాయాగ్రాహకుడు వైజాగ్ మరియు ఊటీ అందమైన ప్రాంతాలను కెమెరాలో బంధించడం లో మంచి పనితనం కనబరిచారు. కిశోరె తిరుమల కు బీచ్ మరియు లైట్ హౌస్ మీద ఉన్నా మమకారం నేను శైలజ లగే ఈ చిత్రం లోను కనబడుతుంది.

చివరి మాట: వాట్ అమ్మ… వాట్ ఐస్ థిస్ అమ్మ

Comments are closed.