విజ‌య్ మామూలోడు కాదు.. మ‌ళ్లీ బూతులే..!

సినిమా మారితే ద‌ర్శ‌కుడు మార‌తాడు.. భాష మారుతుంది.. నిర్మాత మార‌తాడు కానీ హీరో అత‌డే ఉంటే బాడీ లాంగ్వేజ్ ఎలా మారుతుంది..? ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈయ‌న ఏ సినిమా చేసినా కూడా అందులో త‌న ఆటిట్యూడ్ ను మిక్స్ చేసి కొడుతున్నాడు. దాంతో సినిమాపై అంచ‌నాలు అలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు విడుద‌లైన నోటా ట్రైల‌ర్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు.

nota

ఈ మ‌ధ్య తెలుగు హీరోల‌కు రాజ‌కీయాలు ఎక్కువైపోయాయి. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ ముఖ్య‌మంత్రిగా న‌టించాడు. అది ఇంకా మ‌రిచిపోనే లేదు అప్పుడే విజ‌య్ కూడా వ‌చ్చేసాడు. ఈయ‌న కూడా ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. నోటాలో ఈయ‌న పాత్ర సిఎం. అది కూడా భాద్య‌తాయుత ముఖ్య‌మంత్రి కాదు.. కేర్ లెస్ సిఎం అన్న‌మాట‌.
ఏదైనా నా యిష్టం అనుకునే ముఖ్య‌మంత్రి పాత్ర ఇది.

ఏం తెలియ‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. అక్క‌డ సంచ‌ల‌నాలు సృష్టించే పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు విజ‌య్. ఎప్ప‌ట్లాగే త‌న ఆటిట్యూడ్ కు త‌గ్గ‌ట్లుగా బూతుల‌తో పాటు ముద్దులు కూడా కురిపించాడు విజ‌య్. సిఎం పాత్ర అంటేనే ఏదో తెలియ‌ని ర‌చ్చ ఉంటుంది. ఇప్పుడు విజ‌య్ కూడా మ‌రోసారి ఇదే చేస్తున్నాడు. పైగా ముద్దులు.. బూతులతో మ‌రోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజ‌య్. దాంతో నోటాపై అంచ‌నాలు ఆకాశానికి చేరిపోయాయి. అక్టోబ‌ర్ 4న సినిమా విడుద‌ల కానుంది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నాజ‌ర్, స‌త్య‌రాజ్, మెహ్రీన్ న‌టిస్తున్నారు. బై లింగువ‌ల్ సినిమాగా నోటా తెర‌కెక్కుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here