విజ‌య్ దేవ‌ర‌కొండ దారిలో రామ్..

అవును.. రామ్ ఇప్పుడు విజ‌య్ దేవ‌రొకండ దారిలోనే వెళ్తున్నాడు. ఆయ‌న‌తో పాటు ఇప్పుడు చాలా మంది తెలుగు హీరోలు కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. న‌లుగురు న‌డిచే దారిలోనే తాను కూడా న‌డ‌వాల‌ని చూస్తున్నాడు రామ్. ఈయ‌న కూడా త్వ‌ర‌లోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్ళ‌నున్నాడు.

RAM VIJAY DEVARAKONDA

అక్క‌డ ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీ దాటి బ‌య‌టికి వెళ్ల‌ని ఈ కుర్ర హీరో.. ఇప్పుడు అర‌వంపై క‌న్నేస్తున్నాడు. అక్క‌డ ఓ కుర్ర హీరోతో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. ఈ మ‌ల్టీస్టార‌ర్ కు కూడా అక్క‌డి ద‌ర్శ‌కుడే మార్గ‌ద‌ర్శి. ప్ర‌స్తుతం రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ఇది అయిన త‌ర్వాత త‌మిళ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్ట‌నున్నాడు రామ్. ఇది బై లింగువ‌ల్ ప్రాజెక్ట్. రామ్ ఉన్నాడు కాబ‌ట్టి తెలుగులో.. అక్క‌డి హీరో ఉంటాడు కాబ‌ట్టి త‌మిళ్ లో కూడా వ‌ర్క‌వుట్ అవుతుంది. ఇదే ఏడాది ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తుంది. అయితే ఆ హీరో ఎవ‌రు..? ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే విష‌యాల‌పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ఈ హీరో. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి. మొత్తానికి మ‌హేశ్.. నాగార్జున‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర‌హాలోనే ఇప్పుడు రామ్ కూడా బై లింగువ‌ల్ మూవీకి సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌రి ఈయ‌న ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here