రివ్యూ: పేప‌ర్ బాయ్

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

Paper Boy - Rehashed romance
Rating: 2.5/5

www.teluguodu.com

Boring Boy
Rating: 2.25/5

www.telugu360.com

Paper Boy – Love in Bits & Pieces
Rating: 3/5

www.123telugu.com

రివ్యూ          : పేప‌ర్ బాయ్
న‌టీన‌టులు    : స‌ంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, విద్యుల్లేక రామ‌న్ త‌దిత‌రులు
ఎడిట‌ర్        : త‌మ్మిరాజు
సంగీతం       : భీమ్స్
సినిమాటోగ్రఫీ : సౌంద‌ర రాజ‌న్
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్ నంది
నిర్మాత‌లు    : స‌ంప‌త్ నంది, రాములు, వెంకట్, నరసింహ
ద‌ర్శ‌కుడు     : జ‌య‌శంక‌ర్

గీతాఆర్ట్స్ ఏ సినిమాను అంత ఈజీగా న‌మ్మ‌దు. వాళ్లు డ‌బ్బులు పెట్టారు అంటే క‌చ్చితంగా బాగుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంటుంది. అలాంటిది అల్లు అర‌వింద్ చూసి సంప‌త్ నంది నిర్మించిన పేప‌ర్ బాయ్ ను కొన్నాడు. ఆయ‌న రిలీజ్ చేసే స‌రికి ఆస‌క్తి పెరిగిపోయింది. మ‌రి నిజంగానే ఈ చిత్రం అంత బాగుందా.. అస‌లు మెప్పించిందా..?

క‌థ‌:
ర‌వి(సంతోష్ శోభ‌న్)ఓ పేప‌ర్ బాయ్. బిటెక్ చ‌దువుకుని కూడా బ‌తుకుదెరువు కోసం పేప‌ర్ వేస్తుంటాడు. ఆ ప‌నితో పాటు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అల‌వాటు ఉంటుంది. అక్క‌డే త‌న‌లా ఆలోచించే ధ‌ర‌ణి(రియా సుమ‌న్) ర‌వి మ‌న‌సుకు న‌చ్చుతుంది. అందుకే ఆమెను క‌నీసం చూడ‌కుండానే ఇష్ట‌ప‌డ‌తాడు. చూసిన త‌ర్వాత ప్రేమిస్తాడు.. ర‌వి ఆలోచ‌న‌లు న‌చ్చి ధ‌ర‌ణి కూడా ప్రేమిస్తుంది. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకుంటుంది. కానీ అదే స‌మ‌యంలో ధ‌ర‌ణి జీవితంలోంచి వెళ్లిపోతాడు ర‌వి. ఆయ‌న రాసుకున్న డైరీ అనుకోకుండా మేఘ (తాన్యాహోప్) చేతికి వ‌స్తుంది. ఆమె వాళ్లిద్ద‌ర్నీ ఎలా క‌లిపింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఇంటింటికి పేప‌ర్ వేసిన అబ్దుల్ క‌లాం.. ఆ త‌ర్వాత రోజుల్లో రోజూ పేప‌ర్ లో వ‌చ్చారు.. అలాంటి పేప‌ర్ బాయ్ ను త‌క్కువ ఎందుకు చూడాల‌నిపించిందో ఏమో కానీ.. అలాంటి పేప‌ర్ బాయ్ జీవితంపై ఓ సినిమానే తీసేసాడు సంపత్ నంది. భ‌ద్రంగా డైరీలోని పేజీల్లో పేప‌ర్ బాయ్ ప్రేమ‌క‌థ‌ను చూపించాడు. అనుకున్న ఐడియా మంచిదే కానీ.. తెర‌కెక్కించిన విధానం మాత్రం కాదు. ట్రిపుల్ ఎక్స్ సంస్కార‌వంత‌మైన అబ్బాయి.. అంత‌కంటే సంస్కార‌వంత‌మైన అమ్మాయి.. ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో అని చెప్పేదే ఈ పేప‌ర్ బాయ్. వాట్స‌ప్.. ట్విట్ట‌ర్ యుగంలో పుస్త‌కాల ప్రేమేంటో సంప‌త్ నందికే తెలియాలి మ‌రి. ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌.. అన్ని విధాలుగా ఈ చిత్రానికి స‌హ‌కారం అందించాడు సంప‌త్ నంది.

ప్ర‌తీ సీన్ క్లైమాక్స్ అన్న‌ట్లు ప్ర‌తీ సీన్ కావ్యంలా తెర‌కెక్కించ‌బోయి.. కామెడీ చేసాడు ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్. ఈయ‌న‌కు సంప‌త్ నంది నుంచి ఎలాంటి స‌హ‌కారం అందిందో తెలియ‌దు కానీ.. పేప‌ర్ బాయ్ మాత్రం అంచ‌నాలు అయితే అందుకోలేదు. కానీ ఈ డైరీ రాసిన ప్రేమ‌క‌థ‌ను చూస్తుంటే.. శివ‌మ‌ణి బాటిల్ క‌లిపిన ప్రేమ‌క‌థ గుర్తొస్తుంది. కాక‌పోతే అక్క‌డ పూరీ మార్క్ మాస్ ఉంటే.. ఇక్క‌డ ఏ మార్క్ క‌నిపించ‌లేదు.. ప్ర‌తీ సీన్ స్లోగా.. పొయెటిక్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఫీల్ కంటే ఫాస్ట్ గా బోర్ వ‌స్తుంది. సెకండాఫ్ లో క‌థ పూర్తిగా కంగాళీ అయిపోయింది.. బిత్తిరిస‌త్తి ట్రాక్ ఎందుకో ద‌ర్శ‌కుడికే తెలియాలి.. సినిమా ప‌రంగా పేప‌ర్ బాయ్ ఎలా ఉన్నా కూడా.. ఆ పేప‌ర్ బాయ్ గా న‌టించిన సంతోష్ శోభ‌న్ బాగున్నాడు. ఓవ‌రాల్ గా ద‌ర్శ‌కుడిగా అయినా.. నిర్మాతగా అయినా.. ర‌చ‌యిత‌గా అయినా.. సంప‌త్ నందిని బ్యాడ్ టైమ్ బంతాటాడేస్తుంది.

న‌టీన‌టులు:
త‌నునేను సినిమాతో ప‌రిచ‌యం అయిన కొత్త కుర్రాడు సంతోష్ శోభ‌న్ ఈ సినిమాలో అంత‌కంటే బాగా న‌టించాడు.. చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు. అయితే ఈయ‌న స‌త్తా తెలియ‌డానికి ఈ క‌థ స‌రిపోదు.. మ‌రో మంచి క‌థ ప‌డాల్సిందే. మ‌జ్నుతో ప‌ర్లేదు అనిపించిన ప్రియా.. ఇందులో రియాసుమ‌న్ అని పేరు మార్చుకుని వ‌చ్చింది. ప‌ర్లేదు బాగానే న‌టించింది కూడా. తాన్యా అచ్చంగా శివ‌మ‌ణి సినిమాలో ర‌క్షిత‌ను గుర్తు చేసింది.

టెక్నిక‌ల్ టీం:
భీమ్స్ సంగీతం ప‌ర్లేదు. సంప‌త్ నందితో గ‌తంలో ప‌ని చేసిన అనుబంధం ఉంది క‌దా.. అదే ఇక్క‌డ ప‌నికొచ్చింది. కానీ పాట‌లు మాత్రం అంత‌గా ఎక్క‌లేదు. ఒక్క బొంబై పోతావా రాజా పాట మాస్ కు ఫుల్లుగా ఎక్కేసింది. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ పేప‌ర్ బాయ్ కు బ‌లం. ఈయ‌న త‌న వ‌ర్క్ తో సినిమా రేంజ్ పెంచేసాడు. త‌మ్మిరాజు ఎడిటింగ్ చాలా వీక్. సెకండాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుంది. ర‌చ‌యిత‌గా సంప‌త్ నంది మ‌ళ్లీ ఫెయిల్ అయ్యాడు. గాలిప‌టం త‌ర్వాత మ‌రోసారి ఆక‌ట్టుకోలేక‌పోయాడు. జ‌య‌శంక‌ర్ కూడా ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకోలేదు.

చివ‌ర‌గా:
ఎటూ కాని పేప‌ర్ బాయ్ ప్రేమ‌క‌థ‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here