రివ్యూ: గీత‌గోవిందం

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:5

AUDIENCE METER

movie-poster
Release Date
August 15, 2018

Critic Reviews for The Boxtrolls

Geetha Govindam – Rollicking romantic ride
Rating: 3/5

www.teluguodu.com

Adorable Romantic Comedy
Rating: 3.5/5

www.123telugu.com

Lovable Govindam!
Rating: 3.25/5

www.gulte.com

Total Paisa Vasool
Rating: 3.25/5

www.greatandhra.com

Lead Pair Make Rom-Com Shine Read more at
Rating: 3/5

www.mirchi9.com

రివ్యూ: గీత‌గోవిందం
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న‌, నాగ‌బాబు, సుబ్బ‌రాజ్, వెన్నెల కిషోర్, రాహుల్ రామ‌కృష్ణ
సంగీతం: గోపీసుంద‌ర్
నిర్మాత‌: బ‌న్నీవాసు
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: ప‌రుశురామ్

ఇంకా అర్జున్ రెడ్డినే మ‌రిచిపోలేదు ప్రేక్ష‌కులు. అప్పుడే ఆ సినిమా వ‌చ్చి ఏడాది అయిపోయింది. ఆ మేనియా నుంచి బ‌య‌టికి రాక ముందే ఇప్పుడు గీత‌గోవిందం అంటూ వ‌చ్చాడు. పైగా గీతా ఆర్ట్స్ కావ‌డంతో అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి. మ‌రి నిజంగానే ఈ అంచ‌నాల‌ను సినిమా అందుకుందా..?

క‌థ‌:
విజ‌య్ గోవింద్(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఓ కాలేజ్ లెక్చ‌ర‌ర్. భార్య‌ను అమ్మ‌గా చూసుకోవాల‌నుకునేంత మంచి అబ్బాయి. అలాంటి వాడి జీవితంలోకి అనుకోకుండా గీత (ర‌ష్మిక మంద‌న్న‌) వ‌స్తుంది. గుళ్లో చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఆ త‌ర్వాత ఆమె మాయం అయిపోతుంది. అంత‌లోనే చెల్లి పెళ్లి సెట్ కావ‌డంతో విజ‌య్ ఊరికి బ‌య‌ల్దేర‌తాడు. తీరా అదే బ‌స్ లో గీత కూడా వ‌స్తుంటుంది. త‌న ఫ్రెండ్ ఇచ్చిన స‌ల‌హాతో గీత ముందు ఓ కారెక్ట‌ర్ లేని వాడిగా మిగిలిపోతాడు గోవింద్. కానీ గీత వాళ్ల అన్న‌య్య‌నే గోవింద్ చెల్లికి ఇవ్వ‌డంతో అప్ప‌టికి సైలెంట్ అయిపోతుంది గీత‌. కానీ ఈ గీత‌గోవిందం మ‌ధ్య రచ్చ మాత్రం జ‌రుగుతూనే ఉంటుంది. చివ‌రికి హీరోయిన్ మ‌న హీరోను ఎలా అర్థం చేసుకుంటుంది.. ఎప్పుడు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటుంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
నేను మారిపోయాను అంటూ పాపం విజ‌య్ చెప్పినా న‌మ్మ‌లేదు.. ఇప్పుడు గీత‌గోవిందం చూసిన త‌ర్వాత న‌మ్మ‌క త‌ప్ప‌లేదు. ఏం మాట్లాడుతున్నవ్ రా.. ఎవ‌డ్రా అది అంటూ అరిచిన కుర్రాడేనా.. ఇప్పుడు మేడ‌మ్ మేడ‌మ్ అంటూ ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది అనిపించింది. గీత గోవిందంలో అంతా ముందుగా క‌నెక్ట్ అయిన పాయింట్ కూడా ఇదే.. ఒక్క సినిమాతో రాముడు మంచి బాలుడు అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. గీత‌.. గోవింద్ పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్న విధానం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా విజ‌య్.. ర‌ష్మిక మ‌ధ్య ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్రాక్ అదిరిపోయింది. కామెడీ సీన్స్ లో పీక్స్ చూపించాడు విజ‌య్.. ఇక ర‌ష్మిక కూడా ఆక‌ట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను కాస్తా విజ‌య్ త‌న వైపుకు మార్చేసుకున్నాడు. స‌రైన న‌టులు ప‌డితే నార్మ‌ల్ క‌థ కూడా అందంగా ఎలా ఉంటుందో గీత‌గోవిందం చూస్తే అర్థం అయిపోతుంది.
క‌థ పాత‌దే అయినా కూడా.. క‌థ‌నం ఆస‌క్తికరంగా.. ఎంట‌ర్ టైనింగ్ గా అనిపించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే అర్జున్ రెడ్డికి పూర్తి కాంట్రాస్ట్ కారెక్ట‌ర్ తో.. త‌న న‌ట‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసాడు. అవ‌స‌రం అయిన‌పుడు న‌వ్వులు.. అవ‌కాశం వ‌చ్చిన‌పుడు ప‌ర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించాడు విజ‌య్. ఇక ర‌ష్మిక కోసం మూన్నెళ్లు ఆగామ‌ని చెప్పాడు అల్లుఅర‌వింద్.. సినిమా చూసిన త‌ర్వాత.. ఆమె ప‌ర్ఫార్మెన్స్ చూసిన త‌ర్వాత మూడు కాదు ఆర్నెళ్లు ఆగినా త‌ప్పులేదు. క్లైమాక్స్ లో ర‌ష్మిక న‌ట‌న హైలైట్.. ఇక వెన్నెల కిషోర్ కామెడీ చివ‌ర్లో క‌డుపులు చెక్క‌లే. అత‌డి కారెక్ట‌ర్ ప‌రుశురామ్ అద్భుతంగా రాసుకున్నాడు.. క‌రెక్ట్ టైమ్ లో ఎంట్రీ కూడా ఇచ్చాడు.. రొటీన్ క‌థ అని చూడ‌కుండా.. అక్క‌డ‌క్క‌డా స్లో అవుతుంద‌నే కంప్లైంట్స్ లేక‌పోతే.. హాయిగా ఈ వీకెండ్ లో థియేట‌ర్ కు వెళ్లి ఓ సారి చూసుకుని వ‌చ్చే క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ గీత‌గోవిందం. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న ప్ర‌తీ సినిమా అర్జున్ రెడ్డి కాదు.. అప్పుడప్పుడు గీత గోవిందాలు వ‌స్తుంటాయి.. ఫ్యామిలీతోనే వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. అత‌డిలో ఏ స్థాయి న‌టుడు ఉన్నాడో అర్జున్ రెడ్డి చూపించింది. ఇప్పుడు గీత‌గోవిందం మ‌రోసారి నిరూపించింది. గోవింద్ గా న‌వ్విస్తూనే న‌వ‌ర‌సాలు పండించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇత‌డు ప‌క్కా స్టార్ మెటిరియ‌ల్. ఛ‌లోతో ఆక‌ట్టుకున్న ర‌ష్మిక‌.. ఇక్క‌డ‌ గీత‌గా మ‌రోసారి ఆక‌ట్టుకుంది. క‌థ‌లో ఆమెదే డామినేటింగ్ రోల్. ప్ర‌తీ సీన్ లోనూ విజ‌య్ తో పోటీ ప‌డి న‌టించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో విజ‌య్ ను కూడా డామినేట్ చేసింది. నాగ‌బాబు హీరో నాన్న‌గా బాగున్నాడు. వెన్నెల కిషోర్ న‌వ్వులు పూయించాడు. క్లైమాక్స్ లో ఈయ‌న‌దే కీ రోల్. థియేట‌ర్ నుంచి బ‌య‌టికి న‌వ్వుకుంటూ వ‌స్తున్నారంటే దానికి కార‌ణం వెన్నెల కిషోర్. ఇక సుబ్బ‌రాజు త‌న పాత్ర వ‌ర‌కు బాగా చేసాడు. హీరో ఫ్రెండ్ గా రాహుల్ రామ‌కృష్ణ న‌వ్వించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
గోపీసుంద‌ర్ మ్యూజిక్ సినిమాకు బ‌లం. పాట‌ల‌తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న నుంచి వ‌చ్చిన మంచి ఔట్ పుట్ ఇది. ముఖ్యంగా ఇంకేం కావాలితో పాటు మ‌రో రెండు పాట‌లు బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. విజువ‌ల్స్ చూడ్డానికి బాగున్నాయి. స్క్రీన్ పై అందంగా క‌నిపించింది సినిమా అంతా. ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ అక్క‌డ‌క్క‌డా కాస్ల స్లో అయిన‌ట్లు అనిపించినా.. బోర్ కొట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. గీతాఆర్ట్స్ నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి. హీరో మార్కెట్ ను బ్యాలెన్స్ చేస్తూ పెట్టారు. ప‌రుశురామ్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. తెలిసిన క‌థ‌నే మ‌ళ్లీ అందంగా చెప్పాడు.

చివ‌ర‌గా:
గీత ల‌వ్స్ గోవిందం.. ఆడియ‌న్స్ ల‌వ్స్ గీత‌గోవిందం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here